Nindu Noorella Saavasam November 18 2023 Episode 84: అసలేం జరుగుతుంది ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు మీకేం పని పాట లేదా అని అమరేంద్ర అంటాడు.చూడు అమ్మారు ఇందాకట్నుంచి ఏమి ఇస్తామా ఎవరు నీ పని చేసుకుని హైడ్రాప్ చేసుకోమంటే అని మనోహరి అంటుంది. అందుకేనండి వాళ్ళని వెళ్లిపోండి నేనే వేసుకుంటాను అంటే వినడకుండా ఇక్కడే ఉన్నారు అని భాగమతి అంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి బాగోలేదు కాబట్టి వాళ్ళింటికి పంపించేద్దాం కళ్ళు బాగిన తర్వాత వస్తుంది అని మనోహరి అంటుంది. డ్రాప్స్ వేసుకుంటే పది నిమిషాల్లో తగ్గిపోయే దానికి వారం రోజులు సెలవు ఇవ్వడం దేనికమ్మ అని రాథోడ్ అంటాడు. ఒరేయ్ అమర్ ఆ అమ్మాయికి నువ్వంటేనే భయం రా నువ్వు వెయ్యి డ్రాప్స్ అని శివరామ్ అంటాడు. మామయ్య ఎందుకు మీరు మళ్లీ మళ్లీ అలా చేస్తున్నారు ఆరోజు పార్కులో ఆయన కాపాడినందుకే నేను తెగ ఫీలై పోతున్నాను ఇప్పుడు మళ్ళీ డ్రాప్స్ ఏమంటున్నారా అని అరుంధతి అంటుంది. అమర్ నేను వేస్తాను లే నువ్వు వెళ్ళు అని మనోహరి అంటుంది. వాడు చూసుకుంటాడు లేమ్మా నువ్వు ఎందుకు మనం వెళ్దాం పద అని శివరామ్ అంటాడు.

అయ్యో వాళ్ళిద్దర్నీ అలా వదిలేసి వెళ్లకండి అని అరుంధతి కిటికీ దగ్గర నిలబడి అరుస్తుంది.అమరేంద్ర వెళ్లి భాగమతి కంట్లో డ్రాప్స్ వేస్తాడు, పది నిమిషాలు అయిన తర్వాత కళ్ళు తెరువు అప్పటిదాకా ఇక్కడి నుంచి కథలకు అనే అమరేంద్ర వెళ్ళిపోతాడు. సరేనండి అని భాగమతి అంటుంది. రాథోడ్ పిల్లలు స్కూల్ కి రెడీ అయ్యారా అని అమరేంద్ర అడుగుతాడు. ఇంకా రెడీ అవుతున్నారు సార్ అని రాథోడ్ అంటాడు. వాళ్లని ఏమనకండి నాకు బాగోలేకవాళ్లని లేపలేకపోయాను అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, రేయ్ ఆనందు అలారం పెట్టాల్సింది రా లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని ఆకాష్ అంటాడు. డాడీ వచ్చి ఏమైనా అనాలి నీ సంగతి ఉంటుంది రా అని అమృత అంటుంది. ఇంతలో అమరేంద్ర పిల్లలు అనుకుంటూ వచ్చేస్తాడు. ఏమి అనకండి అని అరుంధతి కిటికీలో నుంచి చూస్తూ అంటుంది. ఇప్పుడు టైమ్ ఎంత అయిందో తెలుసా అని గట్టిగా అంటాడు అమరేంద్ర. ఆరుపు విని నిర్మల రాబోతుండగా, నువ్వు ఉండు నిర్మల ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ లేదని పిల్లలు బాధపడతారని వదిలేశాడు ఇప్పటినుంచి మళ్ళీ పాత అమరేంద్ర లాగానే ఉంటాడు పిల్లలకు అన్ని డిసిప్లేన్ నేర్పిస్తాడు నువ్వు అటుపక్క వెళ్ళకు అని శివరామ్ అంటాడు.

పిల్లలు భయపడుతూ చేతులు కట్టుకొని నిలబడతారు. మాట్లాడరేంటి సమాధానం చెప్పండి అని అమరేంద్ర అంటాడు. డాడీ అలారం మోగలేదు అని అమృత అంటుంది. అంటే అలారం మీదే ఆధారపడి లేస్తున్నారా రేపటి నుంచి 5:30 కు లేవాలి ఎక్ససైజ్ చేయాలి హోంవర్క్ ఫినిష్ అయ్యాకే పడుకోవాలి లేదంటే రేపటి నుంచి పనిష్మెంట్ ఉంటుంది, ఈరోజు చేసిన దానికి ఈవెనింగ్ పనిష్మెంట్ ఉంటుంది త్వరగా రెడీ అయి రండి అని అమరేంద్ర అంటాడు. డాడీ 15 నిమిషాల్లో రెడీ వస్తాం అని అమృతం అంటుంది. కుదరదు పది నిమిషాల్లో రెడీ అయి కిందికి రావాలి అని అమరేంద్ర వెళ్ళిపోతారు. భాగమతి కళ్ళు మూసుకుంటూ తెలుసుకుంటూ వాళ్ళని ఏమీ అనకండి తప్పంతా నాదే వాళ్ళని నేనే లేపలేకపోయాను అంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర కోపంగా మెట్లు గబగబా దిగుతూ వచ్చి భాగమతిని గుద్దేస్తాడు. భాగమతి కింద పడబోతూ ఉండగా అమరేంద్ర పట్టుకుంటాడు. అదే పట్టు అదే డాష్ అంటే అదే ప్లేస్ అయి ఉంటుందే గుద్దింది కూడా మీరేనా అండి అని భాగమతి అంటుంది.

అమరేంద్ర కోపంగా చూస్తాడు. మీరే అయితే నేను మూడు లెక్క పెట్టే లోపు నన్ను పైకి లాగేస్తారు చూడండి అని భాగమతి అంటుంది. ఇంకెందుకు ఆలస్యం కౌంట్ చేయి అని అమరేంద్ర అంటాడు. ఒకటి రెండు మూడు అనేసరికి అమరేంద్ర చేయి వదిలి పెట్టేస్తాడు భాగమతి కింద పడిపోయి అమ్మో నాడి విరిగిపోయింది అని అరుస్తుంది. ఏం జరిగింది అని రాథోడ్ మనోహరి గబగబ హాల్లోకి పరిగెత్తుకొస్తారు. పిల్లల దగ్గర ఉన్న అరుంధతి కూడా ఎందుకు ఆయన గట్టిగా అరిచాడు అని హాల్ దగ్గరికి వస్తుంది. నిన్ను పది నిమిషాలు కూర్చోమంటే నువ్వు ఇల్లంతా తిరుగుతూ నడుస్తున్నావు కనిపించక ఏదైనా గుద్దుకొని నీకేమైనా అయితే ఎరు సమాధానం చెప్పాలి ఈ ఇంట్లో ఎవరికి డిస్ప్లే లేకుండా పోయింది ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు అని అమరేంద్ర అంటాడు.భాగమతి భయపడిపోయి ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంటుంది. అమరేంద్ర కోపానికి ఇంకొంచెం ఆద్యం పోదామనే మనోహరి, అందుకే ఆ అమ్మాయిని ఇంటికి పంపించేద్దామన్నాను మీరే వద్దన్నారు ఇవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు అమర్ అని మనోహరి అంటుంది.

అమరేంద్ర కోపంగా వెళ్ళిపోతాడు. ఏమిటో ఈవిడ ఎవ్వరికి అర్థం కాదు అంటూ రాథోడ్ పైకి వెళ్తాడు. అంజు పాపని వెతకాలి అని అరుంధతి ఇల్లంతా తిరుగుతుంది. రాథోడ్ అలా వెళ్తూ ఉంటే ఒక గదిలో రాసుకుంటూ కనిపిస్తుంది అంజలి. ఏంటి ఇదంతా కళ నిజమా అని రాథోడ్ అంజు దగ్గరికి వెళ్లి, ఏంటి అంజు పాపా నువ్వు చేస్తున్నది నేను చూస్తున్నది ఒకటేనంటావా ఒకవేళ నా కళ్ళు కనిపించట్లేదా, నీ దగ్గర ఒకరు ఉంటేనే బుక్కు తీయని నువ్వు ఎవరు లేని ఈ ప్లేసులో కూర్చొని ఒక్కదానివే చదువుకుంటున్నావా ఇక్కడ ఎవరూ లేరు కానీ యాక్టింగ్ ఆపేయ్ పాప ఏంటి అంజు పాపా మాట్లాడవ తల ఎత్తమ్మ అని రాథోడ్ అంజు తల పైకి వస్తాడు, ఏంటి అంజు పాపా నువ్వు ఏడుస్తున్నావా ఎందుకమ్మా అని రాథోడ్ అంటాడు. నేను డాడీకి భయపడి చదవట్లేదు రాథోడ్ అమ్మ కోసం చదువుతున్నాను అని అంజలి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది