టాలీవుడ్ లో ప్రతీ సినిమాకి యంగ్ అండ్ డైనమిక్ గా తయారవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇదంతా నమ్రత వల్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మహేష్ విషయంలో నమ్రత తీసుకునే కేర్ వల్లే ఆయన ఇంత హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడని ఫ్యాన్స్ చెప్పుకుంటారు. అతడు, పోకిరి, ఖలేజా.. ఇలా ఏ సినిమా తీసుకున్నా మహేష్ అసలు ఏజ్ ఏంటో ఎవరు కనిపెట్టలేరు.
దాదాపు 40 ప్లస్ దాటినా సరే “పోకిరి” లో చూసిన మహేష్ లాగానో లేక పదేళ్ల క్రితం వచ్చిన “ఖలేజా” లో చూసిన మహేష్ లానే కనిపిస్తాడు. ఇలా ఇన్నేళ్లయినా సరే చెక్కు చెదరని అందంతో ఉండడం మన టాలీవుడ్ లో కింగ్ నాగ్ తర్వాత ఒక్క మహేష్ కే ఇలా నవ యువకుడిలా కనిపించడం సాధ్యమవుతోంది.
ఇక మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచారం. కాగా ఇన్నాళ్ళు లాక్ డౌన్ లో ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ అందరు ఒక్కొకరుగా సెట్స్ లో అడుగు పెడుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ 4, వైల్డ్ డాగ్ సినిమాకోసం నాగ్ మొహానికి మేకప్ వేసుకోగా.. ఇప్పుడు మగేష్ బాబు ఒక యాడ్ షూట్ కోసం సెట్ లో అడుగు పెట్టాడు.
దీనికి సంబంధించిన లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాస్ గా స్టైలిష్ హైర్ కట్ తో ఇదే సర్కారు వారి పాట లుక్ అని ప్రచారం జరుగుతుండగా ఫ్యాన్స్ మాత్రం ఇది సినిమా లుక్ కాదని యాడ్ లో కనిపించబోతున్న లేటెస్ట్ మేకోవర్ అని క్లారిటీ ఇస్తున్నారు.ఇక సర్కారు వారి పాట మొదలైనప్పటి నుంచి నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.