NewsOrbit
న్యూస్ హెల్త్

Children: పిల్లల విషయం లో ఈ పొరపాటు మాత్రం చేయకండి!!

Tips for better mental health for children

Children: పిల్లలను కొన్ని విషయాలలో తోటి వారితో పోల్చడం మంచిదే కానీ అన్ని విషయాలలో కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేపనిగా పిల్లల్ని తోటి వారితో పోల్చి, వారిని మానసికం గా ఒత్తిడికి గురిచేస్తే అనుకున్న మార్పు రాకపోగా సమస్య మీరింత పెరిగిపోతుంది. చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో పెద్దలు ఈ పోలికల విషయంలో తప్పనిసరిగా ఆలోచించవలిసిందే.

Tips for better mental health for children
Tips for better mental health for children

ఎదుటి వారినైనా చూసి నేర్చుకుంటారనే ఉద్దేశం తో పెద్దలు అప్పుడప్పుడూ పోల్చి చెప్పవచ్చు. అయితే అది పిల్లల మనసును గాయ పరిచేలా, ఒత్తిడికి గురిచేసేదిగా మాత్రం ఉండకూడదు. మీరు పోల్చిన పోలిక వారిని ఆలోచింపజేసి, వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెరిగేలా చేసేదిగా వుండాలి. చిన్న పిల్లలు ఏది మంచి, ఏది చెడు అనే దాన్ని అర్ధం చేసుకోలేరు. కాస్త కఠినం గా చెప్పే ప్రతి మాటా వారికి తిట్టుగానో, నిందగానో అనిపించవచ్చు . కాబట్టి మీరు చెప్పే మాట వెనకున్నభావాన్ని ప్రేమతో , ఓపికగా వివరించి చెప్పాలి. అప్పుడే మీరు ఏది చెప్పిన తమ మంచికే ననే సంగతి ఆ చిన్నారుల మనసులో నాటుకుంటుంది .

పిల్లకు సంబంధించిన ఏ మార్పు అయినా రోజులు గడిచే కొద్దీ రావలిసిందే కానీ అప్పటికప్పుడే జరిగిపోదు అని గుర్తు పెట్టుకోండి . అందుకే పిల్లలధోరణి ,అలవాట్ల విషయం లో ఒక్కసారిగా మార్పు రావాలనుకోవటం సరయినది కాదు అని గమనించండి . వారిని ఎక్కువగా ఒత్తిడి అభద్రతకు గురిచేస్తే భయపడి ఇల్లు విడిచి పోవటం, గాయపరచుకోవటం వంటివి చేసే ప్రమాదం ఉంది.

ఆహారంతినడం , ఆడుకోవడం వంటి విషయాల్లో తోటి వారితో పోల్చినప్పుడు పిల్లలు ఆనందంగా పోటీపడతారు. చేతి వేళ్ళు ఒకలాఉండవు కదా , ఒక తల్లికి పుట్టినంత మాత్రాన పిల్లలందరూ ఒకేలా ఉండరు అని గుర్తుపెట్టుకోవాలి . ప్రతి బిడ్డకూ కొన్ని ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూనే నేటి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చి దిద్దాలి. ఇందుకు పెద్దలకు అవగాహన, నైపుణ్యం, ఓర్పు అవసరం.

పిల్లలు పోట్లాడుకుంటే మీరు ఒకరి పక్షం లోనే ఉండవద్దు . ఇలా చేస్తే రెండో వారికి మీ మీద, తోబుట్టువు మీద ద్వేషం ఏర్పడుతుంది . ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి కూడా అస్సలు చేయకూడదు.

అస్తమానం పిల్లని ప్రతి విషయంలో తోటి వారితో పోల్చితే, వారిలో ప్రతికూలమైన ఆలోచనా విధానం ఏర్పడి, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పనిచేయటంమొదలు పెడతారు . కొత్త వారితో కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడడం వంటివి వస్తాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N