NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో టాలీవుడ్ స‌పోర్ట్ ఎవ‌రికి… తెర‌వెన‌క ఏం జ‌రుగుతోంది..!

ఇండ‌స్ట్రీ.. అన‌గానే సినీరంగ‌మే గుర్తుకు వ‌స్తుంది. రెండు మూడు ద‌శాబ్దాలుగా.. సినీ రంగానికి, రాజ‌కీయా ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం పెరిగింది. దీంతో ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. సినీ రంగం వైపు రాజ‌కీయ నాయ‌కులు తీక్ష‌ణంగా చూస్తారు. అయితే.. ఒక‌ప్పుడు ఏదొ ఒక పార్టీవైపు సినీ రంగ ప్ర‌ముఖులు నిల‌బ‌డినా.. ఇబ్బంది ఉండేది కాదు. కానీ, రానురాను.. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల స్థాయిలోనూ.. ఒక పార్టీవైపు ఉండి ప్ర‌చారం చేస్తే.. మ‌రో పార్టీకి క‌న్నుకుడుతోంది. దీంతో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, కక్ష‌లు పెరుగుతున్నాయి.

ఫ‌లితంగా సున్నిత మ‌న‌స్కులు, నిశితంగా ఆలోచించే సినీరంగ ప్ర‌ముఖులు పెద్ద‌గా రాజకీయాల గురిం చి ఆలోచించ‌డం మానేశారు. వారు దూరంగా కూడా ఉంటున్నారు. గ‌త ఏడాది తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు సినీ రంగం త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించింది. ఇటు కాంగ్రెస్ , అటు బీఆర్ ఎస్ నుంచి కొంద‌రు న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఆహ్వానం అందినా.. వారు పెద్ద‌గా స్పందించ‌లేదు. త‌ట‌స్థంగానే వ్య‌వ‌హ‌రించారు. దీనికి కార‌ణం.. సినీ రంగానికి తెలంగాణ‌లో స్మూత్ వాతావ‌ర‌ణం ఉండ‌డ‌మే.

దీనిని చెడ గొట్టుకోవ‌డం ఎందుక‌ని భావించిన సినీ పెద్ద‌లు ఎవ‌రికీ మ‌ద్ద‌తు చెప్ప‌లేదు. ఎవ‌రికీ ప్ర‌చారం చేయ‌లేదు. ఒక‌వేళ ప్ర‌చారం చేసినా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లోనే త‌మ అబిప్రాయం చెప్పారు త‌ప్ప‌.. నేరుగా పార్టీ కండువాలు వేసుకోలేదు. కానీ, ఏపీ ప‌రిస్థితి అలాకాదు. ఏపీలో తెలుగు సినీ రంగానికి చెందిన వారు నేరుగారాజ‌కీయాలు చేస్తున్నారు. అగ్ర‌హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా పార్టీ న‌డుపుతున్నారు. ఇక‌, హాస్య న‌టుడు అలీ.. క్యారెక్ట‌ర్ న‌టుడు క‌మ్ ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి వంటివారు వైసీపీలోనే ఉన్నారు.

వారు వైసీపీలో ఉంటూ.. పార్టీ త‌ర‌ఫున స్పందిస్తున్నారు. సో.. తెలంగాణ‌కు, ఏపీకి భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది. ఈనేప‌థ్యానికి తోడు.. తెలంగాణ‌లో సినీ రంగానికి స్మూత్ వాతావ‌ర‌ణం ఉంటే.. ఏపీలో ఆ ప‌రిస్థితి లేద‌ని సినీ రంగ ప్ర‌ముఖులే చెబుతున్నారు. అక్క‌డ కొత్త సినిమాలు విడుద‌లైతే.. టికెట్ ధ‌ర లు పెంచుకునేందుకు అవ‌కాశం ఇస్తుండ‌గా.. ఏపీలో మాత్రం ఆంక్ష‌ల‌తో కూడిన పెంపున‌కే ప్ర‌భుత్వం అనుమ‌తిస్తోంది.

అదేవిధంగా కొన్ని కార‌ణాల‌తో కొంద‌రి హీరోల సినిమాల‌కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం.. ధియేట ర్ల‌ను నిలువ‌రించ‌డంవంటివి గ‌తంలో జ‌రిగాయి. ఇక‌, ఒకానొక ద‌శ‌లో టికెట్ల విష‌యం పెద్ద వివాదానికి కూ డా దారి తీసింది. ఇలా.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇండ‌స్ట్రీకి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఎలాంటి లైన్ తీసుకుంటారు? ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అనేది కీల‌కంగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N