Top Indian Crush: తమ అందం, అభినయంతో సినీ హీరోయిన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.. అలాగే విపరీతమైన క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు.. సోషల్ మీడియాలో నెటిజన్లు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కొంత మంది హీరోయిన్లను ఎంపిక చేశారు.. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా నిలిచిన టాప్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
1. రష్మిక మందన :
రష్మిక మందన కన్నడ సినిమా కిరాక్ పార్టీ పార్టీతో తో సినీ అరంగేట్రం చేసింది.. చలో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. గీతా గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా స్టేటస్ అందుకుంది.. ఆ తరువాత దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో దూసుకెళ్తుంది.. ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది.. ఈ కన్నడ భామ ని సోషల్ మీడియాలో నెటిజన్లు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా చేశారు..
2. ప్రియా ప్రకాష్ వారియర్:
ప్రియా వారియర్.. ఒకేఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ కన్ను కొట్టి స్మైల్ ఇస్తూ ఓవర్ నైట్ లోనే టాప్ సెలబ్రిటీ గా మారిపోయింది.. తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తేజ సజ్జ సరసన ఇష్క్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న.. ఈ ముద్దుగుమ్మను కూడా నెటిజన్లు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా ప్రకటించేశారు..
3. సాక్షి మాలిక్ :
బూం డిగ్గి బూం బూం.. అన్నయ్య పాటలు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరి చూపుని తనవైపు తిప్పుకుంది సాక్షి మాలిక్.. ఈ దెబ్బతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది.. ఈమె కూడా నేషనల్ క్రష్ లిస్టులో చేరిపోయింది..
4. సంజనా :
బాలీవుడ్ టాప్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా దిల్ బేచార్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఆకట్టుకుంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా నిలిచింది..
5. శెర్లి సెటియా :
యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది ఈ భామ.. తన అందచందాలతో యూత్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.. యూట్యూబ్లో వేడిక్కించే పాటలతో.. ఎందరో మనసులని దోచుకున్న ఈ చిన్నది.. నేషనల్ క్రష్ నిలిచింది..
6. క్రికెటర్ స్మృతి మందాన :
ఉమెన్ ఇండియన్ క్రికెటర్ టీం లో అందరి చూపు ను తన స్మైల్ తో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.. తన అందంతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్న స్మృతి మందానని కూడా నెటిజన్లు నేషనల్ క్రష్ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు..
7. దిశా పటాని :
ఎంఎస్ ధోని సినిమాలో క్యూట్ గర్ల్ గా కనిపించి అందరినీ మాయ చేసింది దిశా పటాని.. ఆ తరువాత ఇనిస్టాల్ ఓ బోల్డ్ బికినీ పిక్స్ తో రచ్చ లేపి పాపులారిటీ సొంతం చేసుకుంది.. దిశ కూడా నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా లిస్టులో పేరు సంపాదించుకుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!