NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టౌమ్స్ నౌ స‌ర్వే: మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం… ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే…!

ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. మ‌రో రెండు నెల‌ల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు స‌ర్వే సంస్థ‌లు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ప్ర‌ముఖ జాతీయ ఛానెల్ టౌమ్స్ నౌ గ‌త కొద్ది నెల‌లుగా ఏపీలో ఎవ‌రు గెలుస్తారు ? అనే దానిపై వ‌రుస‌గా స‌ర్వేలు చేసుకుంటూ వ‌స్తోంది. కొద్ది నెల‌ల క్రితం చేసిన రెండు స‌ర్వేల‌ల్లోనూ వైసీపీకి ఏపీలో ఉన్న 25 పార్ల‌మెంటు స్థానాల్లో 24 నుంచి 25 వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పింది. గ‌త రెండు స‌ర్వేల్లోనూ ఇదే విష‌యం టైమ్స్ నౌ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

అయితే తాజా స‌ర్వేలోనూ ఈ సంస్థ మ‌రోసారి ఏపీలో వైసీపీదే అధికారం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. అయితే గ‌తంలో టైమ్స్ నౌ స‌ర్వేలో వైసీపీకి 25కు 25 వైసీపీయే గెలుస్తుంద‌ని చెపితే ఈ సారి 6 సీట్లు త‌గ్గించేసింది. వైసీపీకి 19 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని.. ఇక టీడీపీ – జ‌న‌సేన కూట‌మికి 6 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పింది. ఈ 6 సీట్లు కూడా టీడీపీకే వ‌స్తాయ‌ని.. జ‌న‌సేన‌కు 1 సీటు కూడా రాద‌ని స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని స‌ర్వే చెప్పింది. ఇక జ‌న‌సేన‌కే ఒక్క సీటు రాన‌ప్పుడు అస‌లేం మాత్రం ఓటు షేర్ లేని బీజేపీ, కాంగ్రెస్‌కు మాత్రం ఒక్క సీటు మాత్రం ఎలా వ‌స్తుంది. ఇక ఓట్ల శాతం ప‌రంగా చూస్తే వైఎస్సార్‌సీపీకి 47 శాతం.. టీడీపీ కూట‌మికి 44 శాతం ఓట్లు, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్‌కు 1 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని స‌ర్వే అంచ‌నా వేసింది.

గ‌త ఎన్నిక‌ల్లో 51 శాతం ఓట్లు పొందిన వైఎస్సార్‌సీపీ ఇప్పుడు నాలుగు శాతం ఓట్లు కోల్పోవ‌డంతో పాటు 3 లోక్‌స‌భ సీట్ల‌ను కూడా లాస్ కానుంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 3 లోక్‌స‌భ సీట్లు మాత్ర‌మే సాధించిన టీడీపీ ఇప్పుడు మ‌రో మూడు పెంచుకుని 6 సీట్లు గెలుచుకోనుంది. పార్ల‌మెంటు సీట్ల లెక్క చెప్పిన టైమ్స్ నౌ అసెంబ్లీ సీట్ల ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. టౌమ్స్ నౌ అంచ‌నా ప్ర‌కారం వైసీపీకి 130కు పైగా అసెంబ్లీ సీట్లు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి. టీడీపీకి 40 + సీట్లు రానున్నాయి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju