టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు త్రివిక్రమ్ తో ఒకసారైనా పని చేయాలని అనుకుంటారు. ఆ స్థాయి కలిగిన త్రివిక్రమ్ వేదికపై ఒక ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకోవటం అందరికీ షాక్ కి గురి చేసింది. మేటర్ లోకి వెళితే ఇటీవల రెడ్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ హాజరు కావడం జరిగింది.
రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో సినిమా యూనిట్ ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనేకమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ఒకరైన త్రివిక్రమ్ సినిమా నిర్మాత రవికిషోర్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘నేను “స్వయంవరం” సినిమా చేసిన తర్వాత అవకాశాలు రాలేదు ఎవరూ కూడా సినిమాలు ఇవ్వలేదు.
అటువంటి టైం లో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను. కానీ అదే సమయంలో నాకు ఫాన్ చేసి పిలిపించి “నువ్వే కావాలి” సినిమా కథ రాయించారు. దాని తరువాత “నువ్వు నాకు నచ్చావ్” కథ నేను రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతబాగుందని నాకు వినిపించేవారు. నేను రాసిన కథ మొత్తం చదవేవారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇటువంటి వారికి నేను నాలుగు సినిమాలు రాసే అదృష్టం నాకు దక్కడం నాకు వరంగా అనుకుంటున్నాను. ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అని త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాకుండా ఎంత గొప్ప స్థానంలో తాను వెళ్లినా గాని రవి కిషోర్ గారికి రుణపడి ఉంటాను అంటూ ఆయన కాళ్లను త్రివిక్రమ్ పట్టుకోవడంతో ఈ దృశ్యం చూసిన అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు.