NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం బిగ్ స్టోరీ

Ukraine Russia: జనం చేతిలో తుపాకీ – యుద్ధం నేర్పిన కొత్త పాఠం..! ఉక్రెయిన్ సందేశం..!

Ukraine Russia: ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం సంగతి అందరికీ తెలుసు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అసాధారణంగా జరుగుతోందని చెప్పవచ్చు. ఉక్రెయిన్ తో పోల్చుకుంటే రష్యాకు సైనిక బలం ఎక్కువ, ఆయుధ బలం ఎక్కువ. యుద్ధ విమానాలు, యుద్ద నౌకలు ఎక్కువ. వాస్తవానికి నాలుగైదు రోజులు యుద్ధం జరిగితే ఉక్రెయిన్ లొంగిపోవాలి. అలాంటి చిన్న దేశం ఉక్రెయిన్. రష్యాకు ఉన్న ఆయుధ సంపద, సైనిక బలంలో చూసుకుంటే ఉక్రెయిన్ కు 25 శాతం లోపుగానే ఉంటుంది. అటువంటిది నాలుగు రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్ రష్యాకు లొంగడం లేదు. తలవంచడం లేదు. నిజానికి ప్రపంచం మొత్తానికి ఉక్రెయిన్ ఒక కొత్త పాఠం నేర్పుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు గానీ, ఆ దేశ పౌరులు గానీ, ఆ దేశ సైనికులు స్పూర్తిదాయకమైన పాఠాలు నేర్పుతున్నారు. నిన్న ఒక ఉక్రెయిన్ సైనికుడు రష్యా బలగాలు ఒక వంతెన పై నుండి వస్తుంటే ఆ వంతెనను పేల్చడానికి ఆ సైనికుడు ఆక్కడకు వెళ్లి ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. ఆ వంతెనను పేల్చివేయడంతో రష్యా బలగాలను రాకుండా అడ్డుకున్నారు. ఇది ఒక స్పూర్తి పాఠం కాగా. అందరూ తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.

Ukraine Russia war president Zelensky strategy
Ukraine Russia war president Zelensky strategy

Read More: Ukraine Russia War: రష్యా – ఉక్రెయిన్ పోరులో కీలక పరిణామం .. ఇది నిజంగా ప్రపంచం ఊపిరిపీల్చుకునే వార్తే..

Ukraine Russia: సాధారణ పౌరులు తుపాకులు పట్టుకుని

ఉక్రెయిన్ తమకు సైనిక బలం లేదు, ఆయుధాలు లేవు. ప్రత్యర్ధి దేశంతో పోల్చుకుంటే అంత సైనికులు లేరు అని నిరుత్సాహపడకుండా రష్యాపై ఎదురుదాడి చేస్తోంది. ఉక్రెయిన్ లో సాధారణ పౌరులు 60వేల మంది ఉంటారు. సాధారణ పౌరులు తుపాకులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి పోరాడటానికి సిద్ధం అయ్యారు. ఇది ఉక్రెయిన్ దేశం ప్రపంచానికి చెబుతున్న స్పూర్తి పాఠం. 18 ఏళ్ల యువకుడి నుండి 60ఏళ్ల వయసు ముసలి వరకూ కాస్త దేహధారుఢ్యం గట్టిగా ఉండి., మానసికంగా ధృఢంగా ఉండి మేము యుద్ధానికి వెళతాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం అన్న తెగువ చూపే వేలాది మందికి అక్కడి మిలటరీ అధికారులు తుపాకులు ఇచ్చి స్వేచ్చగా వదిలివేస్తున్నారు. రష్యా బలగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి చంపేయండి అని ఆదేశించారు. పౌరులే యుద్ధానికి దిగడం ఉక్రెయిన్ ప్రపంచానికి తెలియజేస్తున్న పాఠంగా చూడవచ్చు. రష్యాకు ఉన్న ఆయుధ సంపదనను చూసి భయపడకుండా ఉక్రెయిన్ తెగించి పోరాడుతోంది. తమ దేశాన్ని రక్షించుకోవాలన్న తపన, తెగువతో పౌరులు ముందుకు వచ్చి అక్కడి సైన్యానికి అదనపు బలంగా తోడుకావడంతో నాలుగు రోజులైనా రష్యాని ఎదురొడ్డి పోరాడుతోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం కదనరంగంలో

మరో వైపు ఉక్రెయిన్ కు మిత్రదేశాలు సైనిక బలగాలను పంపిణీ చేయడానికి ముందుకు రావడం లేదు గానీ ఆర్ధిక సహకారం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అమెరికా,  జర్మనీతో సహా పలు దేశాలు ఆర్ధిక సహాయం చేస్తుండగా, మరి కొన్ని దేశాలు ఆయుధాలను పంపుతున్నాయి. మరొక విశేషం ఏమిటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో రహస్య ప్రదేశంలో తన కుటుంబంతో దాక్కోకుండా ఆయన కూడా తుపాకీ పట్టుకుని సైనికులతో కలిసి తిరుగుతున్నారు. వారిలో స్పూర్తిని నింపుతున్నారు. ఉక్రెయిన్ చాలా చిన్నదేశం అయినప్పటికీ రష్యా లాంటి పెద్ద శక్తితో తలపడి ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలకు స్పూర్తి పాఠం నేర్పుతోంది. ఉక్రెయిన్ చేస్తున్న ఎదురుదాడి నేపథ్యంలో రష్యా వెనుకడుగు వేస్తుందా, లేదా మరో నాలుగైదు రోజులు ఇదే తరహా యుద్ధం కొనసాగించి ఉక్రెయిన్ ను ఆక్రమించుకుంటుందా లేక శాంతి చర్చలు జరిపి యుద్ధానికి ముగింపు పలుకుతారా అనేది వేచి చూడాలి.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju