ఆడవారైనా ,మగవారైనా ఏ వయ్యస్సులో ముచ్చట ఆ వయ్యస్సులోనే అంటారు. ఆ మాట సెలబ్రేటిస్ కి కూడా వర్తిస్తుంది.. హీరో ల్లో ప్రభాస్ వల్ల హీరోయిన్ల లో కీర్తి వల్ల ఇంట్లో టెన్షన్ టెన్షన్ అని అంటున్నారు. ఆ టెన్షన్ ఎందుకంటే వయసైపోతుంది ఇంకా పెళ్లి చేసుకోండి అంటే చాలు టాపిక్ మార్చేసి అక్కడినుండి ఎస్కేప్ అవుతున్నారట.. అందుకే కుటుంబ సభ్యులు టెన్షన్ పడిపోతున్నారట.
డార్లింగ్ ప్రభాస్ `బాహుబలి` సినిమా తర్వాత ఇక పెళ్లి చేసుకుంటా అని పెదనాన్న కృష్ణంరాజుకు మాటిచ్చి ఆ తర్వాత ఇచ్చిన మాట తప్పాడు. ఇప్పటికి పెళ్లి మాట ఎత్తిన ఏమి మాట్లాడకుండా అందర్నీ టెన్షన్ పడేలాచేస్తున్నాడు మిస్టర్ పెర్ఫెక్ట్ .ఈ మధ్య టాలీవుడ్ లో కొలీగ్ హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుంటే ప్రభాస్ తీరుతో ఇంట్లోవాళ్ళు ఆందోళన చెందుతున్నారట.
ఇక మన నేటి మహానటి కీర్తి సురేష్ కూడా అంతే టెన్షన్ పెట్టేస్తోందిట. ఆమెకు 28 ఏళ్ళు రావడం తోఅత్తారింటి కి దారి చూపించాలని ఇంటిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్న కానీ కీర్తి మాత్రం కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి ఏంటి అంటూ తప్పించుకుంటుందిట. మొత్తానికి ఆ ఇద్దరి ఇళ్లలో ఒకే రకమైన పెళ్లి ఆందోళన అని అంటున్నారు .ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టి వాళ్ళు మాత్రం హాయిగా కెరీర్ చూసుకుంటూ పెళ్లివేడుకను వాయిదా వేస్తున్నారు.
నిజానికి వాళ్లిద్దరూ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న మాట వాస్తవమే అయినా కూడా జీవితం గురించి ఆలోచించడం కూడా అంతకు మించిందే కాబట్టి అటు కెరిర్ తో ఇటు పర్సనల్ లైఫ్ ని అంది పుచ్చుకోవడం చాల అవసరం…అని తమతమ అభిమాన తారలకి సలహా ఇస్తున్నారు.. ఇంక వారి మనస్సు ఎప్పుడు కరిగి పెళ్లి పీటలు ఎక్కుతారో వేచిచూడవలిసిందే ..