Uppena : ఉప్పెన Uppena సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు బుచ్చిబాబు. సుకుమార్ దగ్గర ఇంతకాలం అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా ని ఉప్పెన సినిమాతో సుకుమార్ దర్శకుడిగా మార్చాడు. ఇక బుచ్చిబాబు డెబ్యూ సినిమా ఏకంగా మెగా ఫ్యామిలీ హీరో తో కావడం విశేషం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరో, హీరోయిన్స్ గా ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం అవడం కూడా విశేషం. మొత్తానికి ఉప్పెన సినిమాతో ఒక దర్శకుడు.. ఒక హీరో.. ఒక హీరోయిన్ టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పటి వరకు ఇండస్ట్రీలోనేకాదు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్ ని వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమా ఉప్పెన తో బ్రేక్ చేశాడు. ఇక దర్శకుడు బుచ్చిబాబు టాలీవుడ్ లో పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా బుచ్చిబాబు తో ముందే మైత్రీ వారు నెక్స్ట్ సినిమా కూడా తమ బ్యానర్ లోనే చేసేలా కమిటయ్యారు. అనుకున్నట్టుగానే బుచ్చిబాబు మైత్రీ వారి తో రెండవ సినిమా చేసేందుకు ఒక స్టోరీ రెడీ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుందని సమాచారం.
Uppena : ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు బుచ్చిబాబు.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం మైత్రీ వారు బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ని సెట్ చేసినట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు కి ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది. అదీకాక ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. అందుకే ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. త్వరలో ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ని మైత్రీ వారు ప్రకటించబోతున్నారని సమాచారం. కాగా ఇప్పటికే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ తో మైత్రీ వారు ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!