రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ నన్ను తెగ బతిమిలాడాడు.. వేణు కామెంట్స్ వైరల్..!

Share

సీనియర్ నటుడు తొట్టెంపూడి వేణు ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తరువాత చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. వేణు హీరోగా మాత్రమే కాదు కమెడియన్‌గానూ ప్రేక్షకులను బాగా అలరించాడు. కానీ గత 9 ఏళ్లుగా సినిమాకి దూరంగా వున్నాడు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఒక డైరెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Venu: వేణు రాకతో ఆ కాలం నాటి ప్రేక్షకుల ఖుషి

వేణు రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ ద్వారా ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీలో వేణు ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కేకపుట్టించడం ఉన్నాడు. వేణు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ సందర్బంగా వేణు సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఆ విషయంలో బతిమిలాడిన డైరెక్టర్

వేణు ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నా మొదటి ప్రాధాన్యత సినిమాలకే ఉంటుంది. కానీ కొన్ని కారణాలతో నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. లాక్‌డౌన్ సమయంలో ఫ్రీ టైమ్‌ దొరకడంతో నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాను. అలానే ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూడటం ప్రారంభించాను. కొందరి నటన చూసి అసూయ పడ్డాను. ఈ రోజుల్లో ఇంత మంచి కంటెంట్ వస్తుందా? అని ఆశ్చర్యపోయాను. ఈ సమయంలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ శరత్ మండవ చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో మీరు సినిమాలో నటించకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి కలుద్దాం, ప్లీజ్ అని డైరెక్టర్ మెసేజ్ చేశారు.”

“ఆయనలా బతిమిలాడుతుంటే కాదనలేక కలిశాను. అప్పుడు మూవీలో నా కోసమే ఒక క్యారెక్టర్ రాసుకున్నట్లు చెప్పారు. ఈ క్యారెక్టర్‌ను ఎలా డిజైన్ చేశారో చెప్పారు. ఆ రోల్ నాక్కూడా నచ్చడంతో ఓకే చెప్పానని వివరించారు.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

14 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago