ఈ ఏడాది ప్రారంభంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ బన్నీ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి రెడీ గా ఉంచుకున్నాడు. లాక్ డౌన్ కి ముందే ఈ స్క్రిప్టు వర్కు పనులన్నీ పూర్తి కావడంతో లాక్ డౌన్ అయిన వెంటనే ‘RRR’ ఎన్టీఆర్ బ్యాలెన్స్ షూటింగ్ అయిన వెంటనే…త్రివిక్రమ్ స్టార్ట్ చేయాలని రెడీ అయ్యారు.
కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా పరిస్థితి చాలా డేంజరస్ స్థాయిలో ఉండటంతో RRR షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. మరో పక్క ఎన్టీఆర్ కూడా RRR షూటింగ్ తర్వాతే మిగతా సినిమాలు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో త్రివిక్రమ్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ తో పని చేయడం కోసం విక్టరీ వెంకటేష్ అదేవిధంగా న్యాచురల్ స్టార్ నాని ఇంకా మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ వీళ్లు అంత నెక్స్ట్ రెడీగా ఉన్నారట. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేకపోవడంతో వీళ్ళలో ఎవరితో ఒకరితో త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలని స్క్రిప్ట్ వర్క్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న టాక్.