NewsOrbit
న్యూస్

‘ఆగడు’ సినిమా డైలాగ్ ఏంటి ? అది ఆ లేడి ఎమ్మెల్యే కు ఎందుకు వర్తిస్తుంది?

పర్ఫామెన్స్ వీక్ అయినప్పుడే ప్రచారం పీక్ అని ఆగడు అనే సినిమాలో ఒక పంచ్ డైలాగ్ ఉంది.ఇది పూర్తిగా చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడదల రజనికి వర్తిస్తుందని రాజకీయ పరిశీలకులు సెటైర్లేస్తున్నారు.

 What is the dialogue of the movie 'Agadu' Why does that apply to that Lady MLA
What is the dialogue of the movie ‘Agadu’ Why does that apply to that Lady MLA

పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రజని ఆఖరి నిమిషంలో వై.సీ.పీ లో చేరి అదృష్టవశాత్తూ చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిపోయారు.తెలుగుదేశంపార్టీ లో ఉండగా ఆమె ప్రచార జిమ్మిక్కులను బాగా వంటబట్టించుకున్నారు.సోషల్ మీడియాను వాడుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఎమ్మెల్యే కూడా అయిపోవడంతో ఆమె రోజు సోషల్ మీడియాలో ఉండటానికి అలవాటు పడిపోయారు.ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజూ కొన్ని స్టిక్కర్లను ఫేస్బుక్కులో ఇతర సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

అవే ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి.స్థానికంగా సమస్యలు ఎన్నో ఉన్నా.. సీఎం జగన్ ఏ పథకం.. ప్రాజెక్ట్ ప్రకటించినా అందులో తన ఫొటో.. జగన్ ఫొటో వేసుకొని ఏకంగా స్టిక్కర్లను విడుదల చేసుకొని సోషల్ మీడియాలో హోరెత్తించడం ఈమె తీరు గా మారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చిలకలూరిపేట నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం అయినా..విజిలెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటైనా ఆమె స్టిక్కర్ విడుదల చేయటం పరిపాటిగా మారిపోయింది.ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేసుకొన్నారట. నిజానికి ఆమె ప్రాతినిత్యం వహించే చిలకలూరిపేట నియోజకవర్గం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.

రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి తాగునీటి ఎద్దడి నెలకొనిఉంది .నియోజకవర్గానికి ఇఎస్ఐ ఆసుపత్రిని తెప్పిస్తానన్న ఆమె హామీ అలాగే ఉండిపోయింది .చెప్పుకోవడానికి ఒక్క పెద్ద పరిశ్రమ కూడా లేదు.ఉపాధి అవకాశాలు లేవు కరోనా తో జనం అల్లాడిపోతున్నారు.ఇవన్నీ గాలికొదిలేసి రజని ప్రచార గారడీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.లోకల్ సమస్యలను వదిలేసి ఆమె రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ చేస్తూ వాటి మీద పోస్టర్లు వేసుకుంటున్న వైనం నియోజకవర్గం లో హాట్ టాపిక్ అయింది! ఆమె ఫొటోలకు ఫోజులివ్వడంలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యలపై పెట్టడం లేదని వైసీపీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి.

చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ని కాదని జగన్ అప్పటి రాజకీయ కారణాల వల్ల రజని కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వగా ఆ గాలి లో ఆమె గెలిచింది! మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి మీద కూడా మోజు పెంచుకున్న రజని అందుకు అనుగుణంగా ప్రచారాన్ని తీవ్రస్థాయిలో నిర్వహిస్తోంది.అయితే అదే ఆమెకు పెద్ద మైనస్ కాబోతుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే రజనీ కేవలం షో మాస్టర్ అని జగన్ కు నివేదికలు వెళ్లినట్లు కూడా సమాచారం.ఏం జరుగుతుందో వేచి చూద్దాం!

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N