Niveda pethuraj : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామంది ఎంటరవుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్ ఫాంలలో డిఫరెంట్ కథాంశాలతో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త టాలెంట్ తో పాటు రెండు మూడు సినిమాలు చేసిన సక్సెస్ దక్కని హీరోయిన్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరికి మాత్రం స్టార్ హీరోలతో నటించినా కూడా సోలో హీరోయిన్ గా సక్సెస్ దక్కడం లేదు. దాంతో స్టార్ డం కోసం ఎంత ట్రై చేసినా ఫలితం లేకుండా పోతోంది. అలాంటి ఇద్దరు హీరోయిన్స్ ఇప్పుడు మరోసారి కొత్తగా చేస్తున్న సినిమాలతో తమ లక్ ని చెక్ చేసుకుంటున్నారు.
వాళ్ళే నివేదా పేతురాజ్ .. ప్రియాంక జవాల్కర్. వీరికి అందం, అభినయం కూడా ఉంది. మంచి పర్ఫార్మెన్స్ అనే పేరు ఉంది. హిట్స్ కూడా వీరి ఖాతాలో ఉన్నాయి. అయినా తెలుగులో వీరికి రావాల్సిన క్రెడిట్, పాపులారిటీ రావడం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమాలో ఆయనకి జోడీగా నటించి అలరించిన ప్రియాంక జవాల్కర్ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కెరీర్ నత్త నడకన సాగుతోంది.
Niveda pethuraj : పాగల్ మంచి హిట్ గా నిలుస్తుందని భావిస్తోంది.
ప్రస్తుతం ఈమె చేతిలో తిమ్మరుసు, ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’, ‘గమనం’.. సినిమాలున్నాయి. ఇక నివేదా పేతురాజ్ మంచి నటిగా ఆకట్టుకుంది. గ్లామర్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. అల వైకుంటపురం, రెడ్ లాంటి సినిమాలు చేసినా ఈ బ్యూటీకీ క్రేజ్ రావడం లేదు. ప్రస్తుతం ఆమె ‘విరాటపర్వం’, ‘పాగల్’ సినిమాలు చేస్తోంది. ‘విరాటపర్వం’లో ఒక కీలకమైన పాత్ర చేస్తున్న నివేదా ‘పాగల్ సినిమాలో హీరోయిన్ గా అందాల విందు ఇవ్వనుంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటిస్తున్న పాగల్ మంచి హిట్ గా నిలుస్తుందని భావిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!