Rajashekar : సినిమా ఇండస్ట్రీలో నట వారసులు, వారసురాళ్ళు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలోని అగ్ర హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నట వారసులు హీరో, హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చి స్టార్స్‌గా వెలుగుతున్నారు. చిరు తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తనయుడులు రాం చరణ్, వరుణ్ తేజ్, నిహారికా, మేనల్లుళ్లు సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లుడు కళ్యాణ్ దేవ్ ఇలా అందరూ హీరోలుగా రాణిస్తున్నారు.
కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేశ్ బాబు కొన్ని సినిమాలు చేసి మానుకున్నాడు. మంజుల నిర్మాతగా, నటిగా సత్తా చాటుతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణ తర్వాత మళ్ళీ ఆ స్థాయి స్టార్ డం సంపాదించుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా తన రేంజ్ ఏ స్థాయిలో సంపాదించుకున్నాడో తెలుస్తూనే ఉంది. నాగార్జున ఆ తర్వాత నాగ చైతన్య, సుమంత్, సుశాంత్ సహా అక్కినేని వారసులు హీరోలుగా రాణిస్తున్నారు. హిట్ ఫ్లాప్స్ పక్కన పెడితే అక్కినేని హీరోలు నటిస్తున్న సినిమాలు వరుసగా వస్తున్నాయి.
Rajashekar : స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోతున్నారు.
Rajashekar : అలాగే మంచు మోహన్ బాబు నటవారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ నిర్మాతలుగా, నటులుగా టాలీవుడ్లో రాణిస్తున్నారు. అగ్ర నిర్మాత రామానాయుడు తనయులు సురేశ్ బాబు నిర్మాతగా, వెంకటేశ్ హీరోగా రాణిస్తుండగా, సురేశ్ బాబు తనయుడు రానా హీరోగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు రానా తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇలాగే దర్శకుడు రాఘవేంద్ర రావు, ఈవీవీ సత్యనారాయణ తనయులు సహ పలువు స్టార్స్ నట వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే కొందరు మాత్రం స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు ఇదే క్రమంలో హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటీ నటులు డా.రాజశేఖర్ – జీవితల తనయులు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన సినిమా దొరసాని. ఈ సినిమాతో రాజశేఖర్ – జీవితల పెద్ద కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమా అంత సక్సెస్ కాకపోయినా ఆమెకి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో కూడా శివాత్మిక కీలక పాతలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని సమాచారం.
Rajashekar : గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది.
Rajashekar : ఇక మరో కుమార్తె శివాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ఇంతక ముందు రాజశేఖర్ తో కల్కి సినిమా తీసి హిట్ ఇచ్చాడు. ఈ క్రమంలో వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దాంతో శివానిని హీరోయిన్గా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మ మీద పెట్టారు రాజశేఖర్ – జీవిత. అయితే సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పోటీ తట్టుకోవాలంటే ప్రయోగాత్మక కథలకి సిద్దంగా ఉండాలి. మరి శివాని – శివాత్మిక హీరోయిన్స్ గా ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!