Krithi shetty: ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి పోటీ ఇస్తుంది కృతి శెట్టి..ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నాయో చూడండి

Share

Krithi shetty: టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్నలే. ఇద్దరి చేతులలో తెలుగు, హిందీ, తమిళ సినిమాలున్నాయి. నిర్మాతలు ఈ ఇద్దరు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా కాదనకుండా ప్రాజెక్ట్‌కి ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే, రష్మిక మందన్నల చేతికి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అందుతున్నాయి. పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్‌తో రాధే శ్యామ్ అలాగే త్రివిక్రం – మహేశ్ బాబు ప్రాజెక్ట్ చేస్తోంది.

krithi-shetti-became more popular than pooja hegde, rashmika mandanna
krithi-shetti-became more popular than pooja hegde, rashmika mandanna

హిందీలో రెండు సినిమాలు తమిళంలో విజయ్ సరసన ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. రష్మిక మందన్న తెలుగులో పాన్ ఇండియన్ సినిమా పుష్ప, అలాగే శర్వానంద్‌తో ఆడవాళ్ళు మీకు జోహార్లు, హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తమిళంలో కార్తి సరసన సుల్తాన్ సినిమా చేసింది. త్వరలో కొత్త తమిళ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయనుందని సమాచారం. అలాగే తెలుగులో కూడా కొత్తగా మొదలయ్యే పాన్ ఇండియన్ సినిమాలకి రష్మిక మందన్న పేరు పరిశీలిస్తున్నారట.

Krithi shetty: పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి గట్టి పోటీ ఇస్తోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి.

అయితే పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి గట్టి పోటీ ఇస్తోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాకి ముందు ఒక్క సినిమా అవకాశం వస్తే బావుండు అని ఎంతో ఆతృతగా ఎదురు చూసింది. కానీ ఉప్పెన సినిమా తర్వాత ఒక్క సినిమా ఒప్పుకోవాలన్నా ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేయాలా అని ఆలోచిస్తోంది. అంతగా కృతి శెట్టికి వరుస ప్రాజెక్ట్స్‌తో ఊపిరాడనంత బిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కూడా కుళ్ళుకొని మొహాలు మాడ్చుకోవాల్సిందే. అంతగా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటోంది.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తోంది. సాయి పల్లవి, మడోనా స్టెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. అయినా అందరి దృష్ఠి కృతి శెట్టి మీదే ఉంది. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగ రాయ్ ఈ ఏడాదే రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో సాగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతోంది.

Krithi shetty: ప్రస్తుతం 5 క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కృతి శెట్టి

ఇక నాగార్జున – నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజులో చైతూకి జంటగా కృతి శెట్టి నటిస్తోంది. రమ్యకృష్ణ నాగ్ సరసన నటిస్తుండగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిసున్నాడు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. ఇంద్రగంటి సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది.

అలాగే తాజాగా నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజిక వర్గం అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాని ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా, నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట మూవీస్ బ్యానర్‌లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇలా ప్రస్తుతం 5 క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న కుర్రభామ కృతి శెట్టి మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కి త్వరలో సైన్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి పోటీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.


Share

Related posts

స్పైడర్‌ వుమన్‌గా సమంత.. పోస్టులను షేర్‌ చేసింది..!

Srikanth A

సామ్ జామ్ లో చిరంజీవి ప్రోమో వచ్చింది… అదిరిపోయింది! మిస్ అవ్వకండి!!

Naina

Roja: రోజా స్టార్ హీరోయిన్ అవ్వడం వెనుక ఉన్న ఆ స్టార్ ఎవ్వరో తెలుసా?

Naina