Foreigners: విదేశీయుల కి ఎలాంటి మూఢ నమ్మకాలు ఉంటాయో  తెలిస్తే  ఆశ్చర్య పోతారు ??

Share

Foreigners: మన దేశం సంప్రదాయాలకు మాత్రమే కాదు  మూఢనమ్మకాలకు పుట్టిల్లు వంటిదని, చాలా మంది అంటుంటారు.  బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చిన , తుమ్మినా అశుభం అని సాయంత్రం దాటితే ఇల్లు ఉడ్చకూడదు అని..  మంగళవారం,శుక్రవారం .. హెయిర్ కట్ షేవింగ్   చేసుకో రాదని.. శుక్రవారం ఇంటికొచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళరాదు.. శనివారం మాంసాహారం  తినకూడదు .. ఇలా  రక రకాల నియమాలు  పాటిస్తున్నారు కొందరు.

అయితే ఇలాంటి పట్టింపులు  కేవలం మన దేశంలోనే కాదు..  ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో పాటించేవారు ఉన్నారు. ఆ మూఢనమ్మకాలేమిటో  తెలుసుకుందాం.టెక్నాలజీకి  మారుపేరుగా ఉన్న  జపాన్‌లో కూడా మూఢనమ్మకాలు  ఉన్నాయి . జపనీయులు రాత్రుళ్లు అద్దంలో ముఖం చూసుకోరట.నిజానికి ఇది మన పెద్దలు కూడా చెప్పారు.  చీకటి పడ్డా సమయం లో ఆత్మలు తిరుగుతాయి అని అప్పుడు  అద్దంలో మొహం తీసుకోవడం వలన   ఆత్మలు అద్దంలో కనిపిస్తాయని.. మనిషి లోకి ప్రవేశించి నష్టం కలిగిస్తాయి అని నమ్ముతారు.   మన దేశంలో బయటికి వెళ్ళేటప్పుడు   పిల్లి ఎదురైతే అశుభం గా భావిస్తారు. కానీ జర్మన్లు నల్ల పిల్లి ఎదురైతే శుభం గా భావిస్తారు. నల్ల పిల్లి కుడివైపు  నుండి ఎడమవైపుకు  వెళితే శుభంగా, ఎడమ నుండి కుడికి  వైపుకు వెళ్తే  అశుభంగా  భావిస్తారు.

తుమ్మితే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండే తమ  వారు లేదా స్నేహితులు తమ గురించి తలుచుకుంటూ ఉంటారు అని  గ్రీస్ వాసులు నమ్ముతారు.కుక్క మలాన్ని పొరపాటున  మనం తొక్కితే ఛీ.. ఛీ.. అంటాము. కానీ ఫ్రాన్స్‌లో  కుక్క మలాన్ని ఎడమ కాలితో తొక్కితే ధనము, ఐశ్వర్యం కలుగుతాయి అని  ఫ్రాన్స్  ప్రజల  నమ్మకం.అదే  కుడి కాలితో తొక్కితే కీడు జరుగుతుందని  భావిస్తారు.


Share

Related posts

Ram Charantej: సోషల్ మీడియాలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ తేజ్..!!

sekhar

వహ్వా..! జగన్ నిర్ణయాలు..! క్యేబినెట్ లో కీలక చర్చలు..!!

Srinivas Manem

CoviSelf Test: ఇంట్లోనే కరోనా టెస్ట్.. 15 నిమిషాల్లో రిజల్ట్..!!

bharani jella