NewsOrbit
న్యూస్

జగన్ వర్రీ : ఎన్ని చోట్ల టీడీపీ ని ఓడించినా .. అక్కడ మాత్రం అవ్వట్లేదు .. !!

Share

దాదాపు నాలుగు దశాబ్దాలు కలిగిన తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది. ఆ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు ఈ స్థాయిలో టీడీపీ పార్టీ ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం అని కామెంట్ చేయడం జరిగింది. కాగా జగన్ తన తండ్రి చనిపోయిన నాటినుండి పూర్తిస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సమయం నుండి తన ప్రత్యర్ధి టీడీపీ ఏ అన్న రీతిలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినా కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. చాలావరకు గ్రామస్థాయి నుండి మంచి బలమైన క్యాడర్ కలిగిన టీడీపీ ని తన ప్రత్యర్థి గా ఎంచుకొని రాజకీయ ఎత్తుగడలు వేస్తూ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తో నువ్వానేనా అన్నట్టుగా జగన్ పోరాడటం జరిగింది.

 

Security tightened at residences of Chandrababu, Jagan in ...ఇటువంటి చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో దాదాపు చాలాచోట్ల టీడీపీ పునాదులు కదిలి పోయేలా డిపాజిట్లు కోల్పోయేలా గెలవడం జరిగింది. కానీ వైయస్ జగన్ 2014 మరియు 2019 ఎన్నికలలో  తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీని  అసలు టచ్ చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొనడం జగన్ కి వర్రీ తెచ్చినట్లు ఉందట. 2019 లో గెలిచిన తర్వాత విశాఖ మరియు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు పార్టీ తరఫున బలంగా నిలబడుతున్న తరుణంలో ఈ విషయంలో జగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా పని జరగడంలేదని గోదావరి జిల్లాలో వినబడుతున్న టాక్.

 

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్పలు. ఈ నాయకులు ఎప్పుడూ నిత్యం ప్రజల లో ఉండటంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన నాయకులు పెద్దగా యాక్టీవ్ లేకపోవడంతో … తూర్పు గోదావరిలో టీడీపీ గ్రాఫ్ ఏమీ కింద పడలేదు అన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. 2014 ఎన్నికలలో మరియు గత సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంతో, ఈసారి ఎలాగైనా తూర్పు గోదావరిలో వైఎస్ఆర్సిపి పూర్తిగా మెజార్టీ స్థానాలు గెలిచేలా జగన్ అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇందు మూలంగానే గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఉండే కాపుల విషయములో వైసీపీ పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమాలు అమలు చేయాలని డిసైడ్ అయినట్లు కూడా పార్టీలో టాక్ వినబడుతోంది 

 

 


Share

Related posts

పూజా హెగ్డే రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోవడంతో క్లారిటీకొచ్చేసిన ఫ్యాన్స్ …!

GRK

జీహెచ్ఎంసీ కొత్త కార్పోరేటర్ల పేర్లతో గెజిట్ ఎస్ఈసీ జారీ..!!

somaraju sharma

ఖరీదైన బెంజ్‌ కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తి…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ..!

Ram