ఇప్పటికే నిరుద్యోగులు కొరకు ఒక అకాడమిక్ క్యాలెండర్ ను వినూత్న రీతిలో విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తమ పాలనలో ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేది ముందుగానే వైసిపి వారు క్లియర్ గా క్యాలెండర్ లో పొందుపరిచారు.
అదే క్రమంలో జగన్ సర్కారు ఇప్పుడు 5373 పోస్టులను భర్తీ చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కీలకమైన ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లోని అనేక కేటగిరిల్లో ఈ పోస్టులు ఉంటాయి. త్వరలోనే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఇందులో ఫార్మసిస్ట్ పోస్టులు, నర్సులు మరియు అనేకమైన వైద్య సంబంధిత కేటగిరీల ఉండడం గమనార్హం. వాటిల్లో కొన్ని కాంట్రాక్ట్ పరమైన ఉద్యోగాలు ఉండగా మరి కొన్ని పర్మెనెంట్ వి ఉన్నాయి. ఈ కరోనా సమయంలో ఈ పోస్టుల భర్తీ ఎంతో కీలకం కానుంది.