NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Z-Category Security: కేంద్ర బీజేపీతో చెలిమి వల్ల ఫస్ట్ ప్రయోజనం లభించింది(గా)..! ఇకపై లోకేష్ కు జడ్ క్యాటగిరి భద్రత

Z-Category Security: రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు సీట్లు లేవు..టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు బీజేపీతో పొత్తునకు సుముఖత వ్యక్తం చేయలేదు.. కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు కోసం రోజుల తరబడి వేచి ఉన్నారు. చివరికి సక్సెస్ అయ్యారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు మరో సారి కూడా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. అందుకే భవిష్యత్తు ప్రయోజనాలు, వ్యవస్థల సహాకారం కోసం చంద్రబాబు బీజేపీతో చెలిమి కోసం వెంపర్లాడారు అనేది నిర్వివాదాంశం.

బీజేపీతో చెలిమి కారణంగా టీడీపీకి ఇప్పుడు ఫస్ట్ ప్రయోజనం కనబడింది. అది ఏమిటంటే .. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నారా లోకేష్ కు జెడ్ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 అక్టోబర్ లో ఏఓబీ ఎన్ కౌంటర్ తర్వాత లోకేష్ కు జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సీ (సెక్యురిటీ రివ్యూ కమిటీ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ కు భద్రత తగ్గించింది.

సెక్యురిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సలు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం..లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తొంది. లోకేష్ కు ముప్పు ఉన్నా వైసీపీ సర్కార్ భద్రత తగ్గించిందని, తగిన భద్రత కల్పించాలంటూ రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు లోకేష్ భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖలు రాశారు. భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని పలు మార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికీ లోకేష్ భద్రత సిబ్బంది తీసుకువెళ్లింది. యువగళం పాదయాత్ర లో లోకేష్ టార్గెట్ గా అనేక సార్లు వైసీపీ ప్రేరేపిత భౌతిక దాడులు జరిగాయంటూ రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

లోకేష్ భద్రత విషయంలో గతంలో అనేక పర్యాయాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వెళ్లినా స్పంధన కొరవడింది. కానీ ఇప్పుడు టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామి కావడంతో ..సెక్యురిటీ రివ్యూ కమిటీ సిఫార్సు పక్కన పెట్టి భద్రత తగ్గించిన విషయాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. జడ్ క్యాటరిగీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం రాత్రికి సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని లోకేష్ కు భద్రత పెంచిన విషయాన్ని వెల్లడించారు. ఆదివారం నుండి లోకేష్ కు జడ్ క్యాటగిరి భద్రత కొనసాగుతుంది. ఇది ఒక విధంగా బీజేపీ చెలిమి వల్ల లభించిన ప్రయోజనమే అని చెప్పవచ్చు.

Janasena: జాతీయ పర్యాటక ప్రాంతంగా పిఠాపురంను అభివృద్ధి చేస్తా – పవన్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N