NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ ఏపీకి అన్యాయం చేస్తున్నాడు అని తెలియడానికి జగన్ కి ఇంతకన్నా పెద్ద కారణం తెలియాలా..??

Share

వైయస్ జగన్ చాలావరకు కేంద్ర స్థాయిలో రాజకీయాలు చేసే తరుణంలో ప్రధాని మోడీ కి వివిధ అంశాలలో మద్దతు తెలపటం తెలిసిందే. ముఖ్యంగా అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన పార్టీగా వైసిపి దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. దీంతో కొన్ని కొన్ని సందర్భాలలో రాజ్యసభలో, పార్లమెంటులో చాలా వరకు మోడీ జగన్ హెల్ప్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎన్డీయేతో కలిసిపోయినట్లు రాష్ట్రంలో విపక్షాలు కామెంట్లు చేసిన… కేవలం కేంద్రంతో ఎలాంటి వివాదాలు లేకుండా నిధులు సమయానికి రావడం కోసమే కొన్ని, కొన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చినట్లు వచ్చిన విమర్శలపై వైసిపి నాయకులు చెప్పుకుంటూ వచ్చారు.

Vizag Gas Leak: PM Modi Speaks To Andhra CM YS Jagan Mohan Reddy |కాని పరిస్థితి చూస్తే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ ప్రత్యేకంగా చంద్రబాబు హయాంలో గాని జగన్ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని టాక్. చాలా సందర్భాలలో ఏపీకి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భాలలో గాని ఇంకా అనేక విషయాలలో మోడీ ప్రభుత్వం తీరు గమనిస్తే మొండిచెయ్యే చూపించడం జరిగింది. ఇదిలా ఉండగా త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా బీహార్ రాష్ట్రానికి 9 నేషనల్ హైవేలు మోడీ ప్రకటించడం జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారింది. మోడీ తీరు చూస్తే కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విభజనతో నష్టపోయిన తన రాష్ట్రానికి ఏదో రీతిలో హెల్ప్ చేస్తారు మద్దతిస్తారని మోడీ పై ఆశలు పెట్టుకున్న జగన్ కి ఇది కచ్చితంగా షాక్ ఇచ్చే అంశమేనని మేధావులు మరోపక్క వ్యాఖ్యానిస్తున్నారు.

 

మోడీ తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా ఏపీలో ప్రతిసారి ఎన్నికలు జరిగితే తప్ప…. వరాలను కురిపించే పరిస్థితి లేదు అన్నట్టు ఉందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. గతంలోనూ చతిస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సందర్భాలలో భారీ స్థాయిలో ప్యాకేజ్ మోడీ ప్రకటించారు. కానీ ఆయా రాష్ట్రాల ప్రజలు మాత్రం మోడీ వరలకు పడిపోకుండా బీజేపీకి షాక్ ఇచ్చే రీతిలో తీర్పు ఇచ్చారు. ఇలాంటి తరుణంలో బీహార్ రాష్ట్ర ఎన్నికలకు మోడీ వరాలు కురిపించడం మరోపక్క విభజనతో నష్టపోయిన ఏపీ ప్రభుత్వ సహాయాన్ని కేంద్రంలో వివిధ స్థాయిలో తీసుకోవటం దారుణమని ఏపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద మోడీ తీరు చూస్తే ఏపీకి అన్యాయం చేస్తున్నారని జగన్ కి ఇంతకన్నా మరో కారణం ఉండదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా జగన్ కేంద్రం పై ఆశలు పెట్టుకోకుండా ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అని మరికొంతమంది సూచిస్తున్నారు.


Share

Related posts

Ys Jagan Mohan Reddy : రాష్ట్ర వైద్య రంగంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం..!! 

sekhar

పవన్ కళ్యాణ్ పై సజ్జల, బొత్స ఫైర్ .. సన్నాసి మాటలు అంటూ మండిపాటు

somaraju sharma

PR GO 2 Dispute : జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి లేఖ..! వైసీపీలో కొత్త వాదనలు..!!

somaraju sharma