ఎబి వెంకటేశ్వరరావు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటిలెజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలలో ప్రాధమిక సాక్షాధారాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎబి వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను క్యాట్ సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎబివి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను పాటించకుండా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఎబివి సస్పెన్షన్ లోనే కొనసాగుతున్నారు. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎబివి స్వీయ పర్యవేక్షణలో జరిగిన నిఘా పరికరాల కొనుగోళ్ల అంశంపై విచారణ కొనసాగుతోంది. దీంతో ఎబి వెంకటేశ్వరరావు ఆరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయగా మథ్యంతర ఉత్తర్వులు జారీ కావడంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఇదే క్రమంలో ఎబివి వెంకటేశ్వరరావు రాసిన లేఖపై ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించినా ఎబివికి అనుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…