ఇది హత్యాయత్నమే ‘కన్నా’

గుంటూరు, జనవరి 5 :  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తల ధర్నాపై ‘కన్నా’ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌లపై ఇప్పడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.  ఈ ఘటన విషయాన్ని కేంద్ర హోంశాాఖ దృష్టికి తీసుకువెళుతున్నానని అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు గవర్నర్ దృష్టి సారించాలని ఆయన కోరారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని, చంద్రబాబు పాలీసులతో పాలన సాగిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.