ఫూరీ నుంచి మోదీ పోటీ?

 

భువనేశ్వర్, జనవరి 3: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఒడిషా లోని పూరీ నుంచి బరిలోకి దిగనున్నారని   ఆ రాష్ట్ర  భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ తెలిపారు.  ఒడిషా ప్రజలు పూరీ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని పోటీ చేయాలని కోరుతున్నారనీ, ప్రధాని పోటీ చేసే అవకాశాలు 90శాతం మేర ఉన్నాయన్నారు.

ప్రముఖ జగన్నాధ ఆలయం కొలువై ఉన్న పూరీ లోక్‌సభ నుంచి మోదీని పోటీచేయించాలనేది బిజెపి అధిష్టానం యోచిస్తన్నదనే ఊహాగానాల నేపధ్యంలో తాజాగా ప్రదీప్ పురోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

SHARE