రూటు మార్చిన కొడాలి నాని ?

కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)…వైఎస్‌ఆర్‌సిపి ముఖ్య‌నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతున్నారంటే అందులో సంచ‌ల‌నాలే ఉంటాయి. kodali nani over praising cm jagan

త‌న‌దైన శైలిలో చేసే ప్ర‌త్యేక కామెంట్ల‌కు సైతం కొడాలి నాని పెట్టింది పేరు. ఇటీవ‌ల ఆయ‌న సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. తాజాగా మ‌రోమారు ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అయితే, గ‌తంలో ఆయ‌న కామెంట్లు ఒకింత సొంత పార్టీనే ఇరుకున ప‌డేయ‌గా ఇప్పుడు మాత్రం ప్ర‌తిప‌క్ష టీడీపీకి ఇరుకున ప‌డేశారు.

లోకేష్‌పై దుమ్మెత్తి పోసి…

టీడీపీ నేత లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును సైతం టార్గెట్ చేశారు. నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేష్‌‌కు వరి చేనుకి చేపల చెరువుకు తేడా తెలియదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని, రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారని ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగినందుకు బషీర్‌బాగ్‌లో.. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ కూడా వేసుకోవడం కాదని, బషీర్‌బాగ్‌ ఘటనలా మీరూ కాల్చుకుంటే బాగుంటుందన్నారు.

నాని రూటు మారుస్తున్నారా?

కొడాలి నానిది ప్ర‌త్యేక‌మైన రాజ‌కీయ విధానం. దూకుడుగా వెళ్తారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ స‌హా బాబు కోటరీపై అంతెత్తున ఫైర్‌ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ త‌ర‌ఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీంతో త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల ప్ర‌కారం త‌న గళాన్ని నాని మ‌రింత వినిపిస్తున్నారు.

రాజ‌ధానుల విష‌యంలో ఓకే కానీ….

మంత్రి కొడాలి నాని విష‌యంలో కొద్దికాలం కింద‌ట హాట్ టాపిక్ చ‌ర్చ జ‌రిగింది. కొడాలి నానిది ప్ర‌త్యేక‌మైన రాజ‌కీయ విధానం. దూకుడుగా వెళ్తారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ స‌హా బాబు కోటరీపై అంతెత్తున ఫైర్‌ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ త‌ర‌ఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీంతో త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల ప్ర‌కారం త‌న గళాన్ని నాని మ‌రింత వినిపిస్తున్న క్ర‌మంలోనే ఆయ‌న కామెంట్లు వైసీపీని సైతం ఇబ్బందుల పాలు చేశాయి. అయితే, తాజాగా ఆ వైఖ‌రిని మార్చుకొని ప్ర‌తిప‌క్షాన్ని మాత్ర‌మే గురి పెట్టార‌ని అంటున్నారు.