నందమూరి కుటుంబానికి పదవులు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి..??

2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోరమైన ఓటమి తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత టిడిపి సెంట్రల్ కమిటీ పోలిట్బ్యూరో తెలంగాణ టిడిపి కమిటీలలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఈ సారి గట్టిగా దక్కిందన్న ప్రచారం జోరందుకుంది. టిడిపి దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె కి టి టిడిపి రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో నందమూరి సుహాసిని ని ఎందుకు కమిటీ లోకి తీసుకున్నారు అనే చర్చ ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్లు టాక్.

సుహాసిని విజయమే హరికృష్ణకు నివాళి | Kukatpally TDP Candidate Nandamuri Suhasini at NTR Ghat|Balakrishna with Suhasini at NTR Ghat|Balakrishna and Suhasini Pay Tribute to NTR at NTR Ghat|Balakrishna and Suhasini Pay Tribute toతెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో కూకట్ పల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో కుటుంబ సభ్యులు ఉండటం ఎక్కువగా చంద్రబాబుకు ఇష్టం ఉండదని చాలా మంది అంటారు. కానీ ఈ సారి మాత్రం ప్రకటించిన కమిటీలలో నందమూరి, నారా కుటుంబాలు సభ్యులకు నాలుగు పదవులు లభించటం తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్, పోలిట్ బ్యూరో లోకి తొలిసారి బాలకృష్ణని తీసుకోవటం, తెలంగాణ కమిటీ లోకి సుహాసినికి అవకాశం కల్పించారు. అయితే ఇంతమందిని పదవుల్లోకి తీసుకోవటం వెనకాల ముఖ్యంగా నందమూరి కుటుంబానికి పెద్దపీట వేయడం వెనకాల.. టీడీపీ పార్టీలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చాము అన్న మెసేజ్ జనాల్లోకి వెళ్లాలని ఉద్దేశంతోనే చంద్రబాబు… ఎప్పుడూ లేని విధంగా కుటుంబ సభ్యులకు పదవులు కట్ట బేట్టినట్లు పరిశీలకుల మాట.