NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ మాజీ మంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు.. నెల్లూరు టీడీపీలో ప్రకంపనలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్ననే నెల్లూరు సిటీ అభ్యర్ధిని ప్రకటించారు. మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ అభ్యర్ధిగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి అనిల్ కుమార్ యాదవ్ – టీడీపీ నుండి నారాయణల మధ్యే పోటీ జరిగింది. ఆప్పుడు అనిల్ కుమార్ గెలిచారు. మరల వైసీపీ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నానని ప్రకటించడంతో ఈ ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తొంది. అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణపై ఇవేళ అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

YCP MLA Anil Kumar Yadav Sensational comments on former Minister Narayana

 

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్ధుల ఓటమికి నారాయణ ప్రయత్నించారనీ, ఇది మీ నాయకుడు తీరు ఇది అంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు. అనిల్ కుమార్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు నెల్లూరు టీడీపీలో ప్రకంపనలు రేపాయి. గత కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను ఓడించేందుకు ఆయన తమ వద్దకు డబ్బులు పంపారనీ, తాను మాత్రం ఆ డబ్బులు వాపస్ పంపాననీ చెప్పుకొచ్చారు. సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదని అన్నారు. తాను చేసిన ఈ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అవసరమైతే ప్రమాణానికి సిద్దం అని స్పష్టం చేశారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీలో జెండా మోసిన వారిని మోసం చేయడం, పీక కోయడం మామూలేనని అనిల్ పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి ఇందుకు నిదర్శనమని అనిల్ అన్నారు.

తాను నారా లోకేష్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అలర్ట్ అయి విమర్శల దాడి చేస్తుంది అంటే తన బలమేమిటో అర్ధమవుతోందని అనిల్ అన్నారు. నెల్లూరు వైసీపీలో అనిల్ కుమార్ ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వివాదం నేపథ్యంలో రీసెంట్ గా అనిల్ కుమార్ యాదవ్ ను తాడేపల్లికి పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు. సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత నెల్లూరులో అనిల్ కుమార్ తిరిగి యాక్టివ్ అయ్యారు. టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలంటూ లోకేష్, అనం రామనారాయణరెడ్డిలకు సవాల్ విసిరారు. తాజాగా నారాయణపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలపై నారాయణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Timws Now: టైమ్స్ నౌ సర్వే.. మరల అక్కడ మోడీ .. ఇక్కడ జగనే హవానే

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju