NewsOrbit
రాజ‌కీయాలు

‘కృష్ణమ్మ ఆగ్రహమే ఇది!’

అమరావతి: చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. కృష్ణానది వరద ఉధృతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి గురువారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారనీ, దీనితో ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే ఆయన హైదరాబాద్‌లో దాక్కున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

చంద్రబాబు కష్టాలు పగవాడికి కూడా రావొద్దంటూ వ్యంగ్యాస్తాన్ని సంధించారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారనీ, నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడైనా  అర్థమైందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

‘మీరు ఓడిపోవడమేంటయ్యా’ అని అప్పుడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది’ అని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.

నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాసులు పోగు చేసుకున్నాడో ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలనీ, ప్రకృతితో పెట్టుకుంటే బాబు మటాషేనని విజయసాయిరెడ్డి అన్నారు.
ఐదేళ్లుగా బాబు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని ఎల్లో మీడియా రాస్తుందేమోనంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగంగా విమర్శించారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Leave a Comment