NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: టికెట్ దక్కలేదన్న మనస్థాపంతో సీనియర్ కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ లు ఆశించి భంగపడిన నాయకులు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతుండగా, మరి కొందరు తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి చేరిన వారికి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఖరారు చేయడంతో అప్పటి వరకూ తమకే టికెట్ వస్తుందని అశించిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఒ నాయకుడు అయితే మనస్థాపానికి గురై ఏకంగా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్న కాసుల బాలరాజు టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు కాకుండా బీజేపీ నుండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీంద్ర రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన బాలరాజు ఈ ఉదయం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మధ్యహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలరాజు 2009 లో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలరాజు 2014,2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు అయిన ఏనుగు రవీందర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన రవీందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. దశాబ్దాకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను కాదని రీసెంట్ గా బీజేపీ నుండి చేరిన రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో బాలరాజు పురుగు మందు తాగాడు. కాగా బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు.

AP CID: సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ లు పెడుతున్నారా..? జర జాగ్రత్త .. హెచ్చరించిన ఏపీ సీఐడీ

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N