NewOrbit
తెలంగాణ‌ న్యూస్

గన్ మిస్ ఫైర్ .. కానిస్టేబుల్ మృతి.. ఎక్కడంటే..?

Share

గన్ మిస్ ఫైర్ ప్రమాదంలో ఒ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కొటాల పోలీస్ స్టేషన్ లో జరిగింది. 2021 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ రజనీకుమార్ గుడిపేట 13వ బెటాలియన్ లో పని చేస్తున్నాడు. గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అవ్వడం వల్ల బుల్లెట్ గొంతులోకి దూసుకువెళ్లిందని అంటున్నారు. తీవ్రంగా గాయపడిన రజనీ కుమార్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు.

 

మృతుడు రజనీకుమార్ స్వగ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సురేష్ ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ మృతితో జిల్లాలోని పోలీసు శాఖలో విషాదం నెలకొంది. మరో పక్క రజనీకుమార్ స్వగ్రామం బట్వాన్ పల్లిలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.

Advertisements

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట


Share

Related posts

రోజుకు 50వేలకుపైగా కరోనా పరీక్షలు చేయాలి

Special Bureau

హనిమూన్ కి వెళ్లిన జంట జైలుపాలయ్యింది.. కారణం ఏమిటో తెలిస్తే షాక్?

Teja

Breaking : vakeel saab ట్రైలర్ వచ్చేసింది

Arun BRK