NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

Obulapuram Mining Case:  ఒబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఒఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి తనను ఈ కేసు నుండి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు గత నెల 17న కొట్టేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

IAS Srilakshmi

 

ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ముందుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు చేపట్టరాదంటూ సీబీఐ కోర్టును ఆదేశించారు. దీంతో గత నెల చివరి వారంలో శ్రీలక్ష్మి మినహా ఇతర నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. తాజాగా శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. ఆ కేసులో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను సీబీఐ కోర్టుకు అందించలేకపోయింది, కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.

కాగా ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలు లో ఉన్నారు. 2004 నుండి 2009 వరకూ శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ కేసులో బీవి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్థనరెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు మైఫజ్ ఆలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు. వీరిపై ఇప్పటికే సీబీఐ కోర్టు అభియోగాలను నమోదు చేసింది.

AP Police: ఏపిలో భారీగా డీఎస్పీల బదిలీలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju