NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape Case: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..జూవైనల్ జస్టిస్ బోర్డు ఏమంటుందో..?

Police Key Decisions Hyderabad Gang Rape Case

Hyderabad Gang Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో అయిదుగురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న ఏ -1 సాదుద్దీన్ ను విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన అయిదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు గానూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయిదుగురు మైనర్ నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఈ మేరకు 2015 జూవైనల్ జస్టిస్ యాక్ట్ కు చేసిన చట్ట సవరణలను పోలీసులు గుర్తు చేస్తున్నారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్ గా పరిగణించవచ్చని చెబుతున్నారు. చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన 17 ఏళ్ల మైనర్ బాలుడికి మూడేళ్ల క్రితం జూవైనల్ కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించినట్లు వెల్లడిస్తున్న పోలీసులు.. జూబ్లీహిల్స్ ఘటనలోనూ నిందితులు నేరం గురించి తెలిసే అత్యాచారం చేశారని భావిస్తున్నారు.

Police Key Decisions Hyderabad Gang Rape Case
Police Key Decisions Hyderabad Gang Rape Case

Hyderabad Gang Rape Case: వారిని మేజర్ లుగా పరిగణించాలి

ఈ నిందితులపై సెక్షన్ ను పూర్తిగా అమలు చేసేందుకు మేజర్లుగా పరిగణించాల్సి ఉంటుందని జూవైనల్ బోర్డుకు పోలీసులు తెలియజేశారు. చార్జిషీట్ దాఖలు చేసే సమయానికి నిందితులు అందరూ మేజర్లు అవుతారని పేర్కొన్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే పోలీసుల విజ్ఞప్తి పై జూవైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని తెలియజేయనుంది. సాధారణంగా జూవైనల్ హోమ్ లో ఉన్న మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని సాధారణ జైల్ కు తరలిస్తారు. ఇప్పటికే ఏ 1 సాదుద్దీన్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజులు విచారించనున్నారు. అదే విధంగా జూవైనల్ హోమ్ లో ఉన్న అయిదుగురు నిందితులను సైతం కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నారు.

 

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై బీజేపీతో సహా పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరణంలో పోలీసు అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న కీలక నిర్ణయాన్ని మంత్రి కేటిఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్ గా పరిగణించకుండా కచ్చితంగా మేజర్లుగానే శిక్షించాలని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కేటిఆర్. “అత్యాచారం నేరానికి పాల్పడేంత పెద్దవారతే.. ఆ వ్యక్తిని కూడా పెద్దవారిగానే శిక్షించాలి ..యువకుడిగా కాదు” అని కేసిఆర్ పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju