NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏదో అదుకుంటే .. మరేదో అయ్యింది..!

Share

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. నేడు కేబినెట్ బేటీకి ఆయన డుమ్మా కొట్టడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆయనకు తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆయన ఆ విషయంపై ఎక్కడా స్పందించలేదు. మీడియా ముందుకు వచ్చేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఇవేళ కేబినెట్ బేటీకి హజరు కాకపోవడంతో తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి రెండు పర్యాయాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయి వరకూ ఎదిగారు.

Kishan Reddy

ఇక తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరిస్తుందన్న ఆశలో కిషన్ రెడ్డి ఉన్నారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి దక్షిణాదికి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్, సీనియారిటీ కలిసి వచ్చి జేపి నడ్డా తర్వాత తనకే బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని కిషన్ రెడ్డి ఆశిస్తున్న తరుణంలో ప్రస్తుతం ముళ్ల కిరీటంగా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తొంది. అందుకే ఆయన ఎక్కడా దీనిపై స్పందించకుండా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పలువురు సీనియర్ నేతలు వేర్వేరుగా సమావేశాలు అవుతున్నారు. పలువురు నేతలు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

అసంతృప్త బీజేపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ మంతలనాలు జరుపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అంత అనుకూల పరిస్థితులు లేవు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకూ కొంత ఊపు మీద బీజేపీ.. అక్కడ ఫలితం తారు మారు కావడంతో బీజేపీలో తెలంగాణలో మూడవ స్థానానికి పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే రాజకీయంగా తన ఎదుగుదలకు అవరోధం అవుతుందని తన అనుచరులతో కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు. కిషన్ రెడ్డి కినుక వహించడం వల్లనే కేబినెట్ భేటీకి సైతం గైర్హజరు అయి సైలెంట్ మోడ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తొంది.

BJP: రఘునందనా.. ఏ కాలంలో ఉన్నావయ్యా..! మాట్లాడి, తూచ్ అంటే ఊరుకుంటారా..?


Share

Related posts

ఏనుగు మీద యోగా చేస్తూ కింద పడ్డ బాబా రామ్ దేవ్.. వైరల్ వీడియో

Varun G

Alia Bhatt: ఖరీదైన రింగ్‌తో ఆలియాకి రణ్‌బీర్‌ మ్యారేజ్ ప్రపోజల్‌.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో..!

Ram

Job Notification : సీ- డ్యాక్ లో వివిధ ఖాళీలు.. 

bharani jella