NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరు.

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) ఇక లేరు. వయోభారంతో కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లు స్వరాజ్యం ఈ రోజు తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం తన 13 సంవత్సరాల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నాటి సాయుధ పోరాటంలో తుపాకీ చేతపట్టిన తొలి మహిళా మల్లు స్వరాజ్యమే. మల్లు స్వరాజ్యం అంత్య క్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు సీపిఎం నేతలు తెలిపారు.

Mallu Swarajyam passed away
Mallu Swarajyam passed away

 

1931లో కొత్తగూడెంలో జన్మించిన మల్లు స్వరాజ్యం.. వామపక్ష దిగ్గజ నేత భీంరెడ్డి నర్శింహరెడ్డికి స్వయానా సోదరి. అన్న భీంరెడ్డి నర్శింహరెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్న స్వరాజ్యం.. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. అప్పట్లోనే ఆమె తలపై పదివేల రివార్డు ప్రకటించారు. తన ఉద్యమ సహచరుడైన మల్లు వెంకట నర్సింహారెడ్డి ని వివాహం చేసుకున్నారు. నా మాటే తుపాటి తూటా పేరిట ఆత్మకథ కూడా రాశారు. రాజకీయాల్లో ప్రవేశించిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నుండి 1978, 83 లో రెండు సార్లు సీపిఎం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. 1985, 89 లో ఓడిపోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. సీపీఎం పార్టీ లో అఖిల భారత ఉపాధ్యక్షురాలిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అనేక కీలక పదవుల్లో కొనసాగారు. సీపీఎం కేంద్ర కమటీ నుండి ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొనసాగారు. ఆమె భర్త మల్లు వెంకట నర్శింహరెడ్డి అనారోగ్యంతో 2004 లో మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డి హోమియోపతి వైద్యుడుగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మిర్యాలగూడ సీపీఎంలో చురుగ్గా పని చేస్తున్నారు. కుమార్తె పాదూరి కరుణ. ఈమె 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున నల్లగొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడి పోయారు. రెండవ కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి ప్రస్తతం సూర్యపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

మల్లు స్వరాజ్యం మృతి పట్ల సీఎం కేసిఆర్ తో సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు సంతాపం తెలియజేశారు. ఆమె పోరాట స్పూర్తిని నేతలు కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఆమె భౌతికయాన్ని రేపు ఉదయం 6 గంటలకు సీపిఎం కార్యాలయానికి తీసుకువెళతారు. ఉదయం పది గంటల వరకూ కార్యకర్తల సందర్శనార్ధం అక్కడే ఉంచుతారు. అనంతరం నల్లగొండకు తరలిస్తారు. నల్లగొండలో జరిగే ఆమె అంత్యక్రియలకు సీపీఎం జాతీయ కౌన్సిల్ సభ్యులు హజరు అవ్వనున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju