Dasara: గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని.. ఇటీవలె `శ్యామ్ సింగరాయ్`తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సక్సెస్ జ్యోష్‌లో ఉన్న నాని `అంటే.. సుందరానికీ!`తో ప్రేక్షకుల ముందకు రాబోతున్నాడు. మరోవైపు ఈయన `దసరా` అనే మరో సినిమా చేస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాని తెలంగాణ స్లాంగ్‌లో అలరించబోతున్నారు.
అయితే రేపు ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ రాబోతోంది. మార్చి 20న ఉదయం 11.34 గంటలకు ఈ సినిమా నుండి సర్ప్రైజ్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా పేర్కొంటూ ప్రీ లుక్ పోస్టర్‌ను వదిలారు. అయితే `అది ఫస్ట్‌లుక్ పోస్టరా లేక గ్లింప్సా లేక రెండు కలిపా?` అంటూ నాని తన అభిమానులను ప్రశ్నిస్తూ ఓ పోస్టర్ పెట్టారు.
దీంతో రేపు ఏం అప్డేట్ రాబోతుందా అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేశారు. ఇక గల్లా లుంగీ ధరించి ఊర మాస్ లుక్‌లో నాని కనిపించబోతున్నారని మేకర్స్ తాజాగా వదిలిన ప్రీ లుక్ పోస్టర్ బట్టీ అర్థం అవుతోంది. కాగా, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
First look ? A glimpse ? Or both ?
Tomorrow 11.34AM 🙂#DASARA pic.twitter.com/ft0aKa7reE
— Nani (@NameisNani) March 19, 2022
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!