NewsOrbit
సినిమా

Mahesh-Balakrishna: మ‌హేష్ మూవీలో బాల‌య్య‌.. రాజ‌మౌళి క్లారిటీ!

Mahesh-Balakrishna: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌గా.. స్టార్ రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరో కూడా ఉండ‌నున్నాడ‌ని.. ఆ పాత్ర కోసం న‌టుసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఎంపిక చేశార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ వార్త‌ల‌పై రాజ‌మౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి విసృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ప్రాజెక్ట్ పై కూడా స్పందించారు.

తాజాగా ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బెంగుళూర్ వెళ్ల‌గా.. అక్క‌డ ఓ రిపోర్ట‌ర్ `మ‌హేష్ బాబుతో మీరు తీయ‌బోయే చిత్రంలో బాల‌కృష్ణ కూడా ఉండ‌నున్నారా..?` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. `ఈ సినిమాలో బాలకృష్ణ చేయనున్నారనడటంలో ఏమాత్రం నిజం లేదు.

మహేష్‌ బాబు తప్ప మరో హీరో ఈ సినిమాలో ఉండరు .. ఇది మల్టీ స్టారర్ కాదు` అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం `ఆర్ఆర్ఆర్‌`పైనే ఉంది. ఇది విడుదలైన‌ తర్వాత కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకుని మహేష్ సినిమాను స్టార్ట్ చేస్తా అని రాజ‌మౌళి చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి మ‌హేష్ మూవీలో బాల‌య్య లేర‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N