Sidabad Rape Case: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై డీజీపీ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

Share

Sidabad Rape Case: సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, పలు ప్రజా సంఘాలు, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రాజు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Sidabad Rape Case: telangana dgp clarifes on raju suicide incident
Sidabad Rape Case: telangana dgp clarifes on raju suicide incident

Read More: Big Breaking: కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కార్పోరేటర్లు

రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేశామని తెలిపారు. రైల్వే గ్యాంగ్ మెన్ కూడా నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై తిరగడం చూశాడని చెప్పారు. రాజు రైలు కింద పడటం ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా చూశారనీ వారి నుండి కూడా వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిపారు. కోణార్క్ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి అబద్దాలు చెప్పాల్సిన అవసరం పోలీసులకు లేదన్నారు. నిరాధార ఆరోపణలు తగదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

Read More: Sidabad Rape Case: సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్..!!


Share

Related posts

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ ని గెలిపించడంకోసం రంగంలోకి దిగిన హీరో సందీప్ కిషన్..!!

sekhar

Anchor Suma : స్టేజ్ మీదనే యాంకర్ సుమపై హైపర్ ఆది పంచులు?

Varun G

Ys Jagan Mohan Reddy : ఇక జగన్ భవిష్యత్తు తేల్చేది వాళ్లే..!!

sekhar