NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

T Congress: టీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు .. సీఎల్పీ నుండి జగ్గారెడ్డి బాయ్ కాట్

T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. కొద్ది కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్న టీ కాంగ్రెస్ వర్గింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తాజ్ డెక్కన్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు హజరైయ్యారు.

T Congress mla Jaggareddy clp meeting
T Congress mla Jaggareddy clp meeting

T Congress: రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎల్పీ దృష్టికి తీసుకురావాలన్న ఒకే ఒక అజెండాతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి హజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా తనకు సమాచారం లేకుండా మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారనీ, తాను పార్టీకి దూరంగా ఉంటానని జగ్గారెడ్డి సమావేశం నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

T Congress: సమావేశం నుండి జగ్గారెడ్డి బాయ్ కాట్

సమావేశం నుండి బయటకు వచ్చిన తరువాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నా వద్దన్నారనీ, అందుకే బాయ్ కాట్ చేసినట్లు చెప్పారు. తనను అవమానించే దమ్ము ఎవరికి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు అవుతానని జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన పై తనకు సమాచారం లేదన్నారు. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మరో సారి అసహనం వ్యక్తం చేశారు.

T Congress: జగ్గారెడ్డి రాజీనామా..?

జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కూడా కొద్ది రోజుల క్రితం చెప్పారు. అయితే పార్టీ నేతలు కొందరు ఆయనతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తన రాజీనామా లేఖను జగ్గారెడ్డి ఏఐసీసీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా గాంధీ కుటుంబంపై తన విధేయతను ప్రదర్శిస్తూ వస్తున్న జగ్గారెడ్డి .. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నియామకం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రేవంత్ వ్యవహార తీరుపై మొదటి నుండి అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N