Breaking: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారపై నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద వేగంగా వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం పట్టణానికి చెందిన పలువురు యువకులు హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు హజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం పట్టణానికి చెందిన ఎండి ఇద్దాక్ (21), ఎస్ కె సమీర్ (21), ఎస్ కే యాసీన్ (18) గా పోలీసులు గుర్తించారు.