MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సింగిల్ బెంచ్ ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా విచారణ జరిపిన ధర్మాసనం నిన్న కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పునే సమర్దిస్తూ.. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ సీబీఐ అమలు చేయాలని ఆదేశించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, అప్పటి వరకూ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. అయితే ప్రభుత్వ అభ్యర్ధనను ధర్మాసనం తోసి పుచ్చించి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ సింగిల్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. సీజే అనుమతి తీసుకోవాలని ఏజికి సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు. ఇదే క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవేళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే .. సాక్షాలు ధ్వంసం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం కేసులో ఇప్పటికే అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసు ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ కేసు బీఆర్ఎస్, బీజేపీ మద్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కేసు విషయంలో ఆయా పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్దం జరిగింది. ఈ కేసు దర్యాప్తు సిట్ ద్వారా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుండగా, నిందితులు, బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కాగా సుప్రీం కోర్టులో వచ్చే వారం జరిగే విచారణ లో ఎటువంటి తీర్పు వెలువరిస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా ఈ కేసులో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. సిట్ అధికారులు వారిని కస్టడీ విచారణ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ నిందితులు ముగ్గురికి బెయిల్ మంజూరు కాగా జైలు నుండి విడుదల అయ్యారు.
YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?