NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayashanthi: విజయశాంతి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా..? మల్లు రవి కామెంట్స్ పై విజయశాంతి రియాక్షన్ ఇలా..

Share

Vijayashanthi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ ని ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా మార్పు చేసి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నాటి నుండి కొందరు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా అనేక మంది ప్రముఖులను అరెస్టు చేసిన కేందర్ దర్యాప్తు సంస్థలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత విషయంలో మరోలా వ్యవహరించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

vijayasanthi

దీంతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తొంది. కేసిఆర్ సర్కార్ లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం పీక్స్ కి చేరడంతో బీజేపీ అగ్రనేతలు దీనిపై స్పందించి వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్క బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదనీ, బీఆర్ఎస్ కు పోటీ కాంగ్రెస్ పార్టీయేనని పలువురు బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలో బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితర ముఖ్యనేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో విజయశాంతి కూడా పార్టీ మారతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కొంత కాలంగా పార్టీలో జరుగుతున్నపరిణామాలపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారని అందుకే పార్టీ కార్యక్రమాలకు, పార్టీ అగ్రనేతల పర్యటనలకు దూరంగా ఉంటున్నారనే టాక్ నడుస్తొంది. దీనికి తగ్గట్లుగా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీ మారనున్నారని వస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి దృవీకరించడం సంచలనం అయ్యింది. రేపో మాపో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరతాని ఆయన అన్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి.

ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ విజయశాంతి పేరు లేకపోవడంతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శనివారం హైదరాబాద్ లో జరిగిన మోడీ కార్యక్రమానికి కూడా విజయశాంతి పాల్గొనలేదు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో మోడీని స్వాగతం పలికేందుకు మాత్రం హాజరైయ్యారు. ఎయిర్ పోర్టు వద్ద ఆమె పార్టీపై జరుగుతున్న ప్రచారంపై మీడియా వివరణ కోరగా ముక్తసరిగా సమాధానం చెప్పారు. అటువంటిది ఏమీ లేదు. హాపీ దివాళీ అంటూ వెళ్లిపోయారు. తనకు అలాంటి అలోచన లేదని కానీ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని గానీ బలంగా ఖండించకపోవడం, ముక్తసరిగా అలాంటిది ఏమీ లేదు. మోడీ గారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చాను కదా ఇక అర్ధం చేసుకోండి అంటూ వెళ్లిపోవడంతో ఏదో తేడా కొడుతోందని అనుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

PM Modi: ఎంఆర్పీఎస్ శ్రేణులను ఆకట్టుకునేలా ప్రధాని మోడీ ప్రసంగం .. సామాజిక న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ


Share

Related posts

ఎల్లో అలా..! బ్లూ ఇలా..! “పింక్ డైమండ్” నాయకులదా..!? నారాయణుడిదా..!?

Special Bureau

బాబు పునాదులు వేశారు.. జగన్ బిల్డింగ్ కడుతున్నారు..!!

Muraliak

Corona Vaccine: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 40 వేల మందికి కరోనా..!!

Srinivas Manem