NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: ఎంఆర్పీఎస్ శ్రేణులను ఆకట్టుకునేలా ప్రధాని మోడీ ప్రసంగం .. సామాజిక న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ

Share

PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుస సభలను నిర్వహిస్తొంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోడీ ఇటీవలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హజరైయ్యారు. తాజాగా ఇవేళ ఆయన మారో సారి తెలంగాణలో పర్యటనకు విచ్చేశారు. ఇంతకు ముందు సభల్లో బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి ఆ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసిన ప్రధాని మోడీ.. తాజాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో పాల్గొని ఎంఆర్పీఎస్ శ్రేణులను ఆకట్టుకునేలా ప్రసంగించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ 30 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు ప్రధాని మోడీ. వన్ లైఫ్, వన్ విషన్ లా మంద కృష్ణ పోరాటం చేశారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలను చూశారని, గత ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ .. అనేది తమ విధానం అని అన్నారు. సామాజిక న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు మోడీ. మంద కృష్ణ తన్న చిన్న తమ్ముడుగా అభివర్ణించారు. ఎంతో ప్రేమతో ఆహ్వానించాడని చెప్పారు. మాదిగ బిడ్డ బండారు లక్ష్మణ్ లక్ష్మణ్ నేతృత్వంలో తాను పని చేశాననీ, ఓ కార్యకర్తగా బండారు లక్ష్మణ్ నుండి ఎంతో నేర్చుకున్నానని మోడీ తెలిపారు. తెలంగాణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం కలచివేస్తోందన్నారు.

తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని  అయితే అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అందరినీ విస్మరించిందని మోడీ విమర్శించారు. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసిఆర్ మాట తప్పాడన్నారు. దళితుల సీఎం కుర్చీని కేసిఆర్ కబ్జా చేశాడని ఘాటుగా విమర్శించారు. మాదిగ సామాజికవర్గాన్ని కుడా విస్మరించారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయిందని అన్నారు. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదన్నారు. మూడు ఎకరాల భూమి హామీని బీఆర్ఎస్ నిలబెట్టుకోలేదన్నారు. దళిత బంధు పథకం వల్ల బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగిందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులని, ఈ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

కొత్త రాజ్యాంగం పేరుతో కేసిఆర్ అంబేద్కర్ ను అవమానించారన్నారు మోడీ. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఓడించిందన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్ర పటాన్ని కూడా కాంగ్రెస్ పెట్టలేదన్నారు. అంబేద్కర్ కు భారత రత్న కూడా కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంట్ లో అంబేద్కర్ ఫోటో పెట్టామనీ, భారత రత్న ఇచ్చామని వెల్లడించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తుంటే కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు. దళిత బిడ్డ రామ్ నాథ్ కోవింద్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందనీ, దలిత వ్యక్తి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని మోడీ విమర్శించారు.

బీఆర్ఎస్ సర్కార్ ఇరిగేషన్ స్కీమ్ లను ఇరిగేషన్ స్కామ్ లుగా మార్చారని విమర్శించారు. ఢిల్లీలో ఆప్ తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని, లిక్కర్ స్కామ్ లో రెండు పార్టీల ప్రమేయం ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటేనే అవినీతికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసే ఉన్నాయని, ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లుగా నటిస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీయేనని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ దేశాన్ని కాపాడే విషయంలో, దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రధాని మోడీని మించిన నాయకుడు లేరని అన్నారు. మోడీ ఒక్క సారి మాట ఇచ్చారు అంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. మాదిగ ఉప కులాల సభకు విచ్చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మాదిగల సభకు మోడీ వస్తారని తాము ఊహించలేదన్నారు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిందనీ, ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్య పరుస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేవలం మాటలే చెబుతున్నాయనీ, తమ ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీయేనని అన్నారు. పార్టీలకు అతీతంగా మాదిగలంతా మోడీకి అండగా ఉందామని పిలుపునిచ్చారు. తొలుత ప్రధాని మోడీ సభావేదిక పైకి రాగానే మంద కృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడి పెట్టగా, మోడీ భుజం తట్టి ఓదార్చారు.

Telangana Election: ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం .. బీజేపీ మహిళా నేత తుల ఉమ దారెటు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఆహ్వానాలు


Share

Related posts

ఏపిలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

somaraju sharma

మా కమిషనర్ మంచోడు

somaraju sharma

APPSC JOBS: 1200కుపైగా పోస్టులు భర్తీకి సన్నద్దమవుతున్న ఏపిపీఎస్‌సీ..గ్రూపు -1, గ్రూపు -2 తో పాటు మరి కొన్ని పోస్టులు కూడా..

bharani jella