NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం .. బీజేపీ మహిళా నేత తుల ఉమ దారెటు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఆహ్వానాలు

Share

Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు రాత్రికి రాత్రి కండువా మార్చేస్తుండగా, మరి కొందరు పార్టీపై తిరుగుబాటు చేస్తూ స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో దిగుతామని ప్రకటిస్తున్నారు. జంపింగ్ జపాంగ్ లతో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్ధుల్లో ఆందోళన కల్గిస్తొంది. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు టికెట్ లు ఇవ్వడం కాంగ్రెస్, బీజేపీలో చిచ్చురేపాయి. ఈ రెండు పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఈ నియోజకవర్గం నుండి  మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కు టికెట్ ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం .. చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీఫామ్ ఇవ్వడం తెలిసిందే. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు తుల ఉమ. స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉంటానని పోరాటం చేస్తానని పేర్కొన్నారు తుల ఉమ. బీజేపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీసీ మహిళలకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పై తుల ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెను తమపైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ నేతలతో తుల ఉమ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. మరో పక్క బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పలువురు నేతలతో ఉమ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు ఆగయ్య ఆమెతో మంతనాలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే తుల ఉమ మాత్రం తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో చేరి పని చేసిన తుల ఉమ 2021 లో ఆ పార్టీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు తుల ఉమ తిరిగి బీఆర్ఎస్ లో చేరతారా లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా అనేది ఆసక్తికరంగా మారింది. తొలి నుండి ఆమెకు బీజేపీలో మద్దతుగా నిలిచిన ఈటల రాజేందర్ ఆమెను పార్టీ నుండి బయటకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తారా అనేది అనుమానమేనని అంటున్నారు.

తుల ఉమ రాజకీయ ప్రస్థానం ఇది

చిన్ననాటి నుండి పెత్తందారి వ్యవస్థను ప్రశ్నిస్తూ సామాన్యుల పక్షాన పోరాటాలు చేసిన ఉమ.. నక్సలిజం వైపు ఆకర్షితురాలైయ్యారు. 1984 నుండి 1994 వరకు పదేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. నక్సల్స్ ఉద్యమం పీపుల్స్ వార్, జనశక్తిగా విడిపోయిన సందర్భంలో జనశక్తి వైపు మళ్లారు. 1991 -94 మధ్య జిల్లా కమిటి సభ్యురాలిగా పనిచేశారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే సిరిసిల్ల డివిజన్‌లో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఉద్యమ నాయకుడు తుల రాజేందర్‌తో ఆమెకు వివాహం జరిగింది. అనారోగ్య కారణాలతో 1994 లో రాజేందర్‌, ఉమలు పోలీసులకు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత తుల ఉమ ప్రైవేట్‌గా బిఎ డిగ్రీని పూర్తి చేశారు. బీడీ కార్మికుల పక్షాన పోరాటం చేశారు.

1994 లో సిపిఐ (ఎంఎల్) పార్టీ తరపున జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి  ఓడిపోయారు. 2001 లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. మొదట్లో టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2010 లో పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. టీఆర్ఎస్ తరపున కరీంనగర్ జిల్లా మండల  జెడ్.పి.టీ.సి.గా విజయం సాధించి…2014 జూలై 5న కరీంనగర్ జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికైయ్యారు తుల ఉమా.

2021 జూన్ 4న టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అప్పటి నుండి బీజేపీలో చురుగ్గా పాల్గొంటున్న ఆమెకు కాదని ఇటీవల పార్టీలో చేరిన డాక్టర్ చెన్నమనేని వికాస్ రావుకు బీజేపీ బీ ఫామ్ ఇవ్వడంతో మరల ఆమెకు పార్టీ మారే పరిస్థితి ఏర్పడింది.

Telangana Election: మునుగోడు కాంగ్రెస్‌కి బిగ్ ఝలక్ .. పార్టీకి పాల్వాయి స్రవంతి రెడ్డి రాజీనామా


Share

Related posts

తీగలాగుతున్న సిబిఐ

somaraju sharma

పెళ్ళాలంటే అతనికి ఎంత ప్రాణం అంటే 170 కోట్లు పెట్టి కార్లు కొన్నాడు!

Yandamuri

Rajamouli – Mahesh babu : ఆఫ్రికా అడవుల్లో అతిపెద్ద యాక్షన్ డ్రామా రాజమౌళి _ మహేష్ బాబు సినిమా..

bharani jella