NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: మునుగోడు కాంగ్రెస్‌కి బిగ్ ఝలక్ .. పార్టీకి పాల్వాయి స్రవంతి రెడ్డి రాజీనామా

Share

Telangana Election:  ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అసంతృప్తి సెగ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిణామం రాజగోపాల్ రెడ్డికి ఇబ్బంది గా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు ఘట్టం ముగిసిన తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో స్రవంతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్రవంతి రెడ్డి రేపో మాపో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి (బీజేపీ అభ్యర్ధి) కి మద్దతు ఇవ్వాలంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాడు వెంకటరెడ్డి తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయతే ఆ ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ఓటమి పాలైనప్పటికీ దాదాపు 23వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అప్పుడు ఓటమి పాలైనా మరల ఈ ఎన్నికల్లో తనకే టికెట్ లభిస్తుందని స్రవంతి ఆశించారు. అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంతో పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్ ఖరారు చేసింది. రెండు రోజుల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు స్రవంతి రెడ్డి. పార్టీ కార్యకర్తలు అందరూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

నామినేషన్లు సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే ను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అని సవాల్ విసిరారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్ధి  రాజగోపాల్ రెడ్డికి స్రవంతి రెడ్డి కూడా మద్దతు ఇస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు సులువే అన్న భావనలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో 23వేలకుపైగా ఓట్ల మెజార్టీ గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికల్లో కేవలం పది వేల ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి పై ఓటమి పాలైయ్యారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం రాజగోపాల్ రెడ్డికి మైనస్ అయ్యింది. ఫలితాల అనంతరం కమ్యూనిస్టుల వల్లనే తాను ఓటమి పాలైయ్యానని ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డికి స్రవంతి రెడ్డి మద్దతును దూరం చేస్తే బీఆర్ఎస్ గెలుపు ఈజీ అవుతుందని ఆ పార్టీ ప్లాన్ చేసింది. ఆ క్రమంలో భాగంగా పాల్వాయి స్రవంతి రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తొంది. తొలుత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం పాల్వాయి స్రవంతి తో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశించారు. అయితే రాష్ట్రంలో ఆధికార బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం కాదనీ, కాంగ్రెస్ పార్టీపైనే గెలుపు అంచనాలు ఉండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చేశారు.

రాజగోపాల్ రెడ్డి రాకతో టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీ వీడేందుకు సిద్దమైయ్యారు. దీంతో బీజేపీ నేతలు కృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన తన అనుచరులతో బీజేపీలో చేరగా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది కమలం పార్టీ. ముందుగా కృష్ణారెడ్డి, ఇప్పుడు స్రవంతి పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమేనని అంటున్నారు. ఈ పరిస్థితులను రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా కవర్ చేసుకుంటారో వేచి చూడాలి.

Breaking: తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం .. సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు


Share

Related posts

Health care: వీటిని ఫ్రిజ్లో పెడుతున్నారా..!? అయితే ప్రమాదమే మరి..!!

bharani jella

Lightning Strikes: బెంగాల్‌లో భారీ వర్షం..! పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 26 మంది మృతి..!!

somaraju sharma

Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

sekhar