Wine Shops Close : హోలీ సందర్భంగా మందు బాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి..మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లోని వైన్ షాపులు బార్లు కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందిగా ఆదేశించారు..అలాగే పండుగ రోజు ఇతరులకు అసౌకర్యం కలిగించడం రోడ్ల పై రంగులు జల్లడం గుంపులుగుంపులుగా వాహనాలపై తిరగడం వంటి చర్యలను నిషేధిస్తూ ఉత్తర్వులు ను జారీ చేశారు. ఈ నియమాలను ఉల్లంఘించినట్లు అయితే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
previous post