Ravoyi Chandamama: ఈటీవీలో ప్రసారమయ్యే మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్స్ లో రావోయి చందమామ సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అదేవిధంగా ఈ సీరియల్లో నటించిన పలు యాక్ట్రెస్ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఈ క్రమంలోనే ఈ సీరియల్ లో నటించిన భరత్ కూడా తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించాడు. అలా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈయన అసలు పేరు భరద్వాజ్. జనవరి 25న భరత్ హైదరాబాద్ లో జన్మించాడు. ఇక ఈయనకి ఓ సిస్టర్ సైతం ఉన్నారు. ఇక చిన్నతనం నుంచే భరత్ కి నటన అంటే ఇష్టం ఉండడంతో డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
జెమినీ టీవీలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్తో భరత్ విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అప్పట్లో మొగలిరేకులు సీరియల్ ఎంత దోమారం రేపాయో మనందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ని చూడని వారు అంటూ ఉండరు. అంతలాగా ప్రసిద్ధి చెందింది మరి ఈ సీరియల్. ఇక మొదటి సీరియల్ తోనే భరత్ కి ఎనలేని ప్రేక్షకు ఆదరణ దక్కింది. అంతేకాకుండా వరుస సీరియల్స్ లో నటించే అవకాశాలు సైతం వచ్చాయి. శ్రావణ సమీరాలు, ప్రతిఘటన, పుట్టింటి పట్టుచీర, బంధం, నీలి కలువలు, ఆడదే ఆధారం, స్వాతి చినుకులు వంటి సీరియల్స్ లో నటించి తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించాడు భరత్. ఇక సీరియల్స్ లోనే కాకుండా భరత్ సినిమాల్లోనూ నటించాడు.
జయ జానకి నాయక అనే సినిమాలో భరత్ నటించాడు. ప్రస్తుతం భరత్ రావోయి చందమామ సీరియల్ లో నటిస్తూ తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తున్నాడు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈయనకి మ్యారేజ్ అయింది. భార్య కిరణ్ మై. వీరికి ఓ పాప కూడా ఉంది. అలా ఇండస్ట్రీలో స్థిరపడడమే కాకుండా ఫ్యామిలీ లైఫ్ లో కూడా తన భార్య పిల్లతో చాలా సంతోషమైన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు భరత్. ఇక రానున్న రోజుల్లో ఈయన మంచి మంచి అవకాశాలు అందుకుంటూ మరింత ఎత్తుకు ఎదగాలి అని ఈయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ఒక సీరియల్స్ తోనే తన కెరీర్ ను ముగించకుండా జయ జానకి నాయక సినిమాలో లాగా పలు సినిమాల్లో తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించాలని కోరుతున్నారు. నిజానికి సీరియల్ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి వెళ్లడం అంటే పెద్ద సాహసం అని చెప్పొచ్చు. సాధారణంగా సీరియల్స్ లో కనిపించిన వారిని పెద్దగా సినిమాల్లో తీసుకోరు. అలా తీసుకుంటే తమ సినిమా ఇమేజ్ పడిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ అటువంటి సందేహాలు ఏమి లేకుండా భరత్ ని కొందరు సినిమాల్లోకి తీసుకున్నారు. అలా తీసుకోవడం ద్వారానే ఈయనకి మంచి అవకాశాలు సైతం దక్కుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకునే దిశగానే వెళ్తున్నాడు.