Meghana Raami: చక్రవారం సీరియల్లో ఇంద్రనీల్ అత్త పాత్రలో పోషించిన మేఘన మనందరికీ సుపరిచితమే. అయితే ఆ సీరియల్ టైం లోనే అత్త తో ప్రేమాయణం నడిపాడు ఇంద్రనీల్. ఇక వీరి ప్రేమ కథలో మామూలు ట్విస్టులు లేవు. తన గాఢమైన లవ్ స్టోరీ తాజాగా చెప్పుకొచ్చింది ఇంద్రనీల్ భార్య మేఘన. ఇంద్రనీల్ మరియు మేఘన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్రవాకం సీరియల్లో ఇంద్రకీ అత్తగా నటించిన మేఘన. ఇక సీరియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఇంద్రనీల్ కంటే వయసులో చాలా పెద్దది మేఘన. ఇంద్రనీల్ కంటే 6 నెలలు పెద్దది కావడంతో మొదట్లో వీర్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేరు. అయితే అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చక్రవాకం సీరియల్ కి ముందు ఇంద్రనీల్, మేఘన లు కలచక్రం అనే సీరియల్ లో నటించారు.
ఆ సీరియల్లో ఇద్దరికీ సవతి తల్లిగా చేసింది మేఘన. ఈ సీరియల్ లోనే మేఘన ప్రేమలో పడ్డ ఇంద్రనీల్ ధైర్యంగా ప్రపోజ్ చేశారు. అయితే తనకంటే చిన్నవాడు కావడంతో మేఘన రిజక్ట్ చేసింది. అప్పటికి మేఘన అసలు పెళ్లి చేసుకోకూడదని ఆలోచనలో ఉంది. దీంతో ఇంద్రనీల్ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు మేఘన. ఇక ఇంద్రనీల్ మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపు 8 ప్రపోసల్స్ కు పైగా ప్రపోజ్ చేశాడు. అయితే చక్రవాకం సీరియల్ కి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ప్రీతి, ఇంద్రాలపై ఆ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ చూసిన తరువాత ఇంద్ర పై మేఘనాకి ఇష్టం పెరిగింది. అతనిని ప్రేమిస్తున్న అబ్బాయి వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడం చూసి తన లోపల దాగిన ప్రేమ అతనికి చూపించింది. వెంటనే వెళ్లి ఇంద్రనీల్ కి ప్రపోజ్ చేసింది మేఘన. అయితే ఇంద్రనీల్.. మేఘనాకి ఓ ట్విస్ట్ పెట్టాడు.
వెంటనే ఎస్ చెప్పకుండా.. మా అమ్మని అడిగి చెప్తాను అని మేఘన లవ్ ప్రపోజ్ ని హోల్డ్ లో పెట్టాడు. ఓ రెండు రోజులు టైం తీసుకుని ఇంటికి వెళ్లి మరీ మేఘనాతో లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వీళ్ళ పెళ్లికి వీరి వయసు అడ్డంకంగా మారింది. చక్రవాకం సీరియల్ ధరస్కురాలు మంజుల మొదటిగా వీరి ప్రేమ వ్యవహారం గురించి చెప్పగా.. ఆవిడే.. ఇరువురి పెద్దలతో మాట్లాడింది. రెండు కుటుంబాల మధ్య సన్నిహితమే ఉంది కానీ.. ఇంద్రనీల్ తల్లి మాత్రం పెళ్ళికి ఒప్పుకోలేదు. నీకంటే పెద్దదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావ్? అని ఇంద్రనీల్ తల్లి పెళ్ళికి నో చెప్పింది. ఆర్ ఎల్ ఏ కదా అని ఇంద్రనీల్ ఒప్పించే ప్రయత్నం చేయగా.. నీకు తల్లిగా.. అత్తగా చేసింది. ఆమె నీకంటే చాలా పెద్దదని అనుకుంటారు అందుకు పెళ్లికి నో చెబుతున్నా అని వెల్లడించింది.
ఇక అనంతరం అన్ని సద్దుమణి గాక 2004 డిసెంబర్ 12న పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. అంటే వీళ్ళ పెళ్లి 20 ఏళ్లు అయినా వీరికి ఇంకా సంతానం కలగలేదు. తమకి సంతానం కలగకపోవడానికి.. గల కారణం వీరిద్దరూ తాజాగా బయటపెట్టారు. తమకి ఏజ్ లో ఉన్నప్పుడు సంతానం కలగలేదని ఇప్పుడు సంతానం కలిగిన వారిని చూసుకోవడానికి కుదరదని వెల్లడించారు. ” ప్రస్తుతం మేము 40s లో ఉన్నాం. ఇప్పుడు కట్ట మేము ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటే వారు పెద్దయ్యేసరికి మేము 60s లోకి వెళ్ళిపోతాం. మేము ఎంత డబ్బు సంపాదించి వారికి ఇచ్చిన బ్రతకడం వారికి రావాలి కదా. అప్పుడు మాకు ఏమైనా అయితే వారిని ఎవరు చూసుకుంటారు. ఇవన్నీ ఆలోచించే మేము పిల్లలని దత్తత తీసుకోవడం లేదు ” అంటూ చెప్పుకొచ్చారు ఈ జంట.