Anushka Shetty: టాలీవుడ్ అందాల తార అనుష్క శెట్టి ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతోంది.. అంత క్రేజ్ ఏర్పరచుకుంది మన జేజ్జమ్మ.. వెండితెరపై గ్లామర్ గా కనిపించిన కూడా ఆఫ్ స్క్రీన్ మాత్రం స్వీటీ చాలా సింపుల్ గా ఉంటుంది.. తాజాగా అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
నిన్న రాత్రి నుంచి ఇంటర్నెట్ వరల్డ్ లో అనుష్క పేరు ట్రెండ్ అవుతుండడం ఎవరికీ అర్థం కాలేదు.. సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడే స్వీటీ.. పర్సనల్ లైఫ్ లో ఒక సాధారణ అమ్మాయి ఇలాగే ఉంటుందని.. ఇటీవల లీకైన మరొక ఫోటోతో రుజువైంది.. చాలా సింపుల్ గా ఒక గోడ పక్కన నిలబడి గోడ పక్కన నిలబడి స్మైల్ ఇచ్చేసింది.. ఆ స్మైల్ తోనే చంపేసింది అంటూ కుర్రాళ్లు కామెంట్ చేస్తారు. సరదాగా దిగిన ఫోటోలో నిజంగా అనుష్క ఎంత బాగుందో అంటూ అమ్మాయిలు కూడా ఈర్ష లేకుండా షేర్ చేస్తున్నారు.
అనుష్క ఇటీవల ఇతర యాడ్స్ లో ఎక్కువగా నటించడం లేదు. ఆమెకు చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ అనవసరమైన బ్రాండ్ ను ఎంకరేజ్ చేయడం లేదు. సినిమాల ఎంపిక విషయంలో కూడా ఆమె చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. కంటెంట్ ఉన్న విభిన్న సినిమాలని ఓకే చేస్తుంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి తో ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాతో అలరించనుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!