White Tea: ఈ టీ రుచి చూస్తే.. జన్మలో మర్చిపోరు..!!

Share

White Tea: టీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇప్పటి వరకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, రకరకాల పూల టీ లను టెస్ట్ చేసి ఉంటారు..!! అయితే ఇప్పుడు వాటి స్థానంలోకి వైట్ టీ వచ్చేసింది..!! మిగతా టీ లతో పోలిస్తే వైట్ టీ లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..!! వైట్ టీ ని ఎలా తయారు చేసుకోవాలి..!? ఏ విధంగా తాగితే మన ఆరోగ్యానికి మంచిదొ ఇప్పుడు తెలుసుకుందాం..!!

Ayurvedic Health Benefits of White Tea:
Ayurvedic Health Benefits of White Tea:

White Tea: వైట్ టీ తయారు చేసుకునే విధానం..!!

ఒక గ్లాసు నీటిని తీసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మార్కెట్ లో వైట్ టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. ఒక వైట్ టీ సాచెట్ ఆ కప్పు నీటిలో వేసి రెండు నిముషాలు ఉంచాలి. సాచెట్ లో ఉన్న సారం దిగే వరకు ఉంచి ఇందులో పంచదార కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం తేనెను కలుపుకుంటే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. రోజుకు 3 కప్పుల వైట్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ టీ ను తాగమని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ టీ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం.

Ayurvedic Health Benefits of White Tea:
Ayurvedic Health Benefits of White Tea:

White Tea: వైట్ టీ తో ఈ అనారోగ్య సమస్యలకు చెక్..!!

వైట్ టీ లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన పోగొడుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ప్రతి రోజు వైట్ టీ తాగడం వలన క్యాన్సర్ బారీన పడకుండా చేస్తుంది. వైట్ టీ లో కెఫిన్, ఏజిసిజీ సమ్మేళనాలు ఉంటాయి. శరీరం మెటబాలిజమ్ ను పెంచుతాయి. ఈ టీ లో కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

Ayurvedic Health Benefits of White Tea:
Ayurvedic Health Benefits of White Tea:

వైట్ టీలో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆస్టియోపొరోసిస్ అనేది ఎముకల వ్యాధి. ఈమధ్య ఎక్కువ మందిలో ఈ వ్యాధి నీ చూస్తున్నాము. ఇది ఎముకలను బలహీనంగా మార్చి విరిగి పోయేలా చేస్తుంది. ఈ టీలో ఉండే పాలీఫెనాల్స్, కాటేకిన్స్ ఆస్టియోపొరోసిస్ సమస్యను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా, బలంగా తయారు చేస్తాయి.

Ayurvedic Health Benefits of White Tea:
Ayurvedic Health Benefits of White Tea:

వైట్ టీ లో కాటేచిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకున్న విషపదార్థాలను బయటకు నెట్టి వేసాయి. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగి పోవాలంటే ఇది కచ్చితంగా తాగాల్సిందే. అధిక బరువుతో బాధపడుతున్న వారు రోజుకు మూడు సార్లు ఈ టీ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. గుండె జబ్బులు తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈటీవీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను కలిగిస్తాయి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యుడి నుండి వచ్చే వేడిమి నుండి చర్మాన్ని, కణాలను రక్షించడంలో ఈ టీ సహాయపడుతుంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఎలిమినేట్ అయిపోయిన అవినాష్ కు నాగార్జున బంపర్ ఆఫర్

arun kanna

బిగ్ బాస్ 4: హౌస్ లో సోహైల్ ని కుక్క అంటూ డైలాగ్ వేసిన కంటెస్టెంట్…!!

sekhar

నేను అనర్హుడిని : ఇమ్రాన్

sarath