గత మూడేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు షో లో ఏం జరుగుతోంది…. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది…. ఎవరు ఎలిమినేట్ అవుతారు…. ఎవరు ఫైనల్ వరకు ఉంటారు వంటి విషయాలను ముందు నుండి ప్రేక్షకులు అంచనా వేస్తారు. ఇక న్యాయనిర్ణేతలు కూడా వారే కాబట్టి వారి అంచనాలు దాదాపు తప్పవు.
అయితే ఇంటి సభ్యులు కూడా లోపల ఉన్న వాతావరణాన్ని గమనించి తమలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అప్పుడప్పుడు అంచనా వేయగలరు. వాళ్లకు బయట జరిగేది, ప్రేక్షకుల రెస్పాన్స్ తెలియకపోయినా వారు కూడా కొన్ని సార్లు కరెక్ట్ గానే ఊహిస్తారు. తాజాగా సుజాత ఎలిమినేషన్ విషయంలో కూడా గంగవ్వ చెప్పిన జోస్యం అలాగే నిజం అయింది. మామూలుగా ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ అతను నామినేషన్ లేకుండా మిస్ అయ్యాడు.
మధ్యలో అమ్మ రాజశేఖర్ పేరు వచ్చింది అయితే చివరకు మాస్టర్, సుజాత ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చేసిన గంగవ్వ ఒక్కొకరి గురించి మాట్లాడింది. అందులో భాగంగా సుజాత వంతు వచ్చే సరికి తేల్చేసింది. నువ్వు ఈ వారం ఎలిమినేట్ అవుతావు అని నాకు అనిపిస్తుంది అని సుజాతకు చెప్పింది. ఆ ఒక్క మాటతో సుజాత మొహం మాడిపోయింది .గంగవ్వ అలా అనేసరి.. నీ యవ్వ కి సుజాత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ చివరికి నష్టం మాత్రం తప్పలేదు.
మొత్తానికి గంగవ్వ ఆటను గమనిస్తున్న తీరు చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు సుజాత ఎలిమినేట్ అయినట్లు వార్తలు రావడంతో అందరూ కచ్చితంగా సుజాత ఇంటి నుండి బయటకు వెళ్తుంది అని ఫిక్స్ అయిపోయారు. మరి బయటకు వచ్చాక సుజాత ఎవరి పై ఎలాంటి కామెంట్లు చేస్తుందో వేచి చూడాలి.